AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పదేళ్లుగా సినిమాలు లేవు..కోట్లల్లో సంపాదన.. లగ్జరీ లైఫ్! ఎవరా హీరోయిన్? సంపాదన ఎలా?

గ్లామర్ ప్రపంచంలో మెరుపులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ముఖ్యంగా హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువని అందరూ అంటుంటారు. కొత్త తరం భామలు వస్తున్న కొద్దీ పాత తరం తారలు వెనకబడిపోవడం సహజం. కానీ, ఒకప్పటి ఆ బోల్డ్ బ్యూటీ మాత్రం పదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్నారు.

పదేళ్లుగా సినిమాలు లేవు..కోట్లల్లో సంపాదన.. లగ్జరీ లైఫ్! ఎవరా హీరోయిన్? సంపాదన ఎలా?
Star Heroine From Bollywood
Nikhil
|

Updated on: Jan 09, 2026 | 6:45 AM

Share

ఇప్పటికీ ఆమె లగ్జరీ జీవితాన్ని గడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2001లో అరంగేట్రం చేసిన ఈమె, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లో నటించకపోయినా ఆమె సంపాదన రహస్యం ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ భామ బిపాసా బసు. ఒకప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ నటి, గత పదేళ్లుగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.

చివరిగా 2015లో వచ్చిన ‘అలోన్’ సినిమాలో కనిపించిన ఆమె, ఆ తర్వాత మళ్ళీ మేకప్ వేసుకోలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఆమె పేరు ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. సినిమాలు చేయకపోతే ఆదాయం ఎలా వస్తుందనేది చాలామందికి కలిగే సందేహం. కానీ బిపాసా తన పేరునే ఒక బ్రాండ్‌గా మార్చుకున్నారు. ఆమె సంపాదనలో ప్రధాన వాటా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా వస్తోంది. ఒక్కో వాణిజ్య ప్రకటనకు ఆమె సుమారు రూ. 2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం.

కళ్లు చెదిరే ఆస్తిపాస్తులు మీడియా కథనాల ప్రకారం, బిపాసా బసు నికర ఆస్తి విలువ దాదాపు రూ. 130 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ముంబైలో రూ. 16 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన ఇల్లు ఉండగా, కోల్‌కతాలో కూడా ఆమెకు భారీ భవంతులు ఉన్నాయి. సంపాదనలో ఇన్వెస్ట్‌మెంట్లే కాకుండా, సోషల్ మీడియా పోస్టులు, రియాలిటీ షోలలో గెస్ట్ అప్పీరెన్స్, ప్రైవేట్ ఈవెంట్లు మరియు పాడ్‌కాస్ట్‌ల ద్వారా నెలకు లక్షల్లో ఆర్జిస్తున్నారు. కార్ల విషయంలోనూ ఆమెకు చాలా ఇష్టం ఉంది. ఆమె గ్యారేజీలో ఆడి క్యూ7, పోర్షే కేయెన్, టయోటా ఫార్చ్యూనర్ మరియు వోక్స్‌వ్యాగన్ బీటిల్ వంటి ఖరీదైన లగ్జరీ కార్లు కొలువై ఉన్నాయి. ఈ కార్ల కలెక్షనే ఆమె రాయల్ లైఫ్ స్టైల్‌కు నిదర్శనం.

Bipasha Basu

Bipasha Basu

కుటుంబంతో సరదాగా.. వ్యక్తిగత జీవితం ప్రస్తుతం 47వ పడిలో ఉన్న ఈ సుందరి, తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ మరియు కుమార్తె దేవితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసే ఫోటోలు చూస్తుంటే, సినిమాల కంటే కుటుంబానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది. షూటింగ్‌లు, క్యారవాన్ల గోల లేకుండా అప్పుడప్పుడు వెకేషన్లకు వెళ్తూ ఆ క్షణాలను ఆస్వాదిస్తున్నారు.

నటనకు దూరమైనా, తన బ్రాండ్ వాల్యూను పడిపోకుండా కాపాడుకోవడంలో ఆమె మిగతా హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చి ‘అజ్నబీ’, ‘రాజ్’, ‘జిస్మ్’, ‘నో ఎంట్రీ’ వంటి ఎన్నో హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న బిపాసా బసు, సినిమాల్లో లేకపోయినా ఒక స్టార్‌గా తన ఇమేజ్‌ను కొనసాగిస్తున్నారు. ఆమె ఆర్థిక ప్రణాళికలు మరియు బిజినెస్ మెయిండ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైభవ్ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!
వైభవ్ దెబ్బకు రికార్డులు బద్దలు కావాల్సిందే.. మిషన్ 607 షురూ!
వేడి వేడి పనీర్ బ్రెడ్ పకోడీ.. చల్లని వెదర్‌లో పర్ఫెక్ట్ స్నాక్..
వేడి వేడి పనీర్ బ్రెడ్ పకోడీ.. చల్లని వెదర్‌లో పర్ఫెక్ట్ స్నాక్..
'ది రాజాసాబ్' సినిమాకు హీరోగా ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదా?
'ది రాజాసాబ్' సినిమాకు హీరోగా ప్రభాస్ ఫస్ట్ చాయిస్ కాదా?
కళ్లు తిరగడం: ప్రమాదకర సంకేతం కావచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి
కళ్లు తిరగడం: ప్రమాదకర సంకేతం కావచ్చు.. జాగ్రత్తలు తీసుకోండి
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
మీ టీ కప్పులో దాగున్న ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ హీరోయిన్ పెళ్లి నేనే చేశా.. వాళ్లు నన్ను పట్టించుకోవడం లేదు..
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
ఆ పరుశురాముడికే మార్గదర్శనం చేసిన ఏకా తాతయ్య గురించి మీకు తెలుసా
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
నందీశ్వరుడు ప్రతిష్టించిన శివ లింగం.. మన దగ్గరలోనే ఈ క్షేత్రం
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
ఫోన్‌ను కారులో ఛార్జ్‌ చేస్తే ఏమవుతుంది? చాలా మందికి తెలియంది ఇదే
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..
నువ్వా నేనా అంటున్న బ్యూటీస్.. మరి అదృష్టం ఎవరిని వరించనుందో..