మీ టీ కప్పులో దాగున్న కనిపించని ముప్పు.. లివర్ ఆరోగ్యం కోసం ఈ వాస్తవాలు తెలుసుకోండి..
మన దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరిని వేధిస్తున్న సైలెంట్ కిల్లర్.. ఫ్యాటీ లివర్. కాలేయం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం అనేది వినడానికి చిన్న సమస్యలా అనిపించినా.. సరైన సమయంలో మేల్కోకపోతే అది లివర్ క్యాన్సర్‌కు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం లేవగానే వేడివేడి టీ పడాల్సిందే. కానీ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది అమృతమా లేక విషమా? అనేది తెలుసుకుందాం..

మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, కేలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల భారతీయులలో ఫ్యాటీ లివర్ సమస్య చాపకింద నీరులా విస్తరిస్తోంది. NCBI నివేదిక ప్రకారం.. మన దేశంలో సుమారు 16 నుండి 32 శాతం మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య ఉన్నవారు మిల్క్ టీ తాగవచ్చా? పాలు, చక్కెర కలిపిన టీ కాలేయంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అన్న ప్రశ్నలకు నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.
మిల్క్ టీ – ఫ్యాటీ లివర్: సంబంధం ఏంటి?
సీనియర్ డైటీషియన్ గీతికా చోప్రా ప్రకారం.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాలేయంలో కొవ్వు నిల్వ చేరడానికి ప్రధాన కారణం. మనం చక్కెర కలిపిన మిల్క్ టీ తాగినప్పుడు ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఆ అదనపు గ్లూకోజ్ మన కాలేయంలో కొవ్వుగా పేరుకుపోతుంది.
సంతృప్త కొవ్వు: పాలలో ఉండే సంతృప్త కొవ్వు, టీలోని కెఫిన్‌తో కలిసినప్పుడు జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.
ఇన్సులిన్ నిరోధకత: ఇప్పటికే ఫ్యాటీ లివర్‌తో భారంగా ఉన్న కాలేయంపై, పాలు-చక్కెర కలిసిన టీ మరింత ఒత్తిడిని పెంచుతుంది. ఇది చివరికి టైప్ 2 డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉంది.
టీతో పాటు మీరు తినే స్నాక్స్ ఇంకా ప్రమాదం
చాలామంది మిల్క్ టీతో పాటు బిస్కెట్లు, రస్క్‌లు లేదా టోస్ట్‌లు తింటారు. వీటిలో ఉండే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఇన్సులిన్ సమస్యను మరింత జటిలం చేస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు ఈ కాంబినేషన్‌కు దూరంగా ఉండటం ఉత్తమం.
ఒకవేళ టీ తాగకుండా ఉండలేకపోతే?
టీని పూర్తిగా మానేయడం కష్టమైతే నిపుణులు ఈ క్రింది సూచనలు చేస్తున్నారు.
రోజుకు కేవలం ఒక కప్పు టీకి మాత్రమే పరిమితం అవ్వండి.
తక్కువ పాలు, అతి తక్కువ చక్కెర లేదా బెల్లం వాడండి.
ఉదయం ఖాళీ కడుపుతో మిల్క్ టీ తాగడం అస్సలు మంచిది కాదు.
కాలేయానికి మేలు చేసే ప్రత్యామ్నాయాలు
మిల్క్ టీకి బదులుగా కాలేయాన్ని క్లీన్ చేసే ఈ పానీయాలను ప్రయత్నించండి:
గ్రీన్ టీ లేదా లెమన్ టీ: ఇవి కాలేయంలోని విషతుల్యాలను తొలగిస్తాయి.
దాల్చిన చెక్క టీ: ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
జీలకర్ర నీరు: జీర్ణక్రియను వేగవంతం చేసి కాలేయానికి ఉపశమనాన్ని ఇస్తుంది.
లివర్ ఆరోగ్యం కోసం డైట్ టిప్స్
పీచు పదార్థం: మీ ఆహారంలో దోసకాయ, టమోటా వంటి సలాడ్లను ఎక్కువగా చేర్చుకోండి.
సైలియం హస్క్: ఇది ఫైబర్ అధికంగా ఉండే పానీయం, కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఆహారం నమలడం: ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల జీర్ణక్రియ సులభమై, కాలేయంపై భారం తగ్గుతుంది.
ఫ్యాటీ లివర్ అనేది నిర్లక్ష్యం చేస్తే కాలేయ క్యాన్సర్ లేదా సిర్రోసిస్‌కు దారితీస్తుంది. కాబట్టి మిల్క్ టీని కేవలం అప్పుడప్పుడు తీసుకునే పానీయంగానే చూడాలి తప్ప, అలవాటుగా మార్చుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




