AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Raja Saab Review : ది రాజా సాబ్ మూవీ రివ్యూ.. ప్రభాస్, మారుతిల హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందులోనూ హారర్ ఫ్యాంటసీ జానర్ కావడంతో 'ది రాజా సాబ్'పై ఆసక్తి ఇంకా పెరిగింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా..? ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం. ఈ చిత్రానికి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించారు.

The Raja Saab Review : ది రాజా సాబ్ మూవీ రివ్యూ.. ప్రభాస్, మారుతిల హారర్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..
The Raja Saab Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Jan 09, 2026 | 6:46 AM

Share

మూవీ రివ్యూ: ది రాజా సాబ్

నటీనటులు: ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, జరినా వహాబ్ తదితరులు

సినిమాటోగ్రాఫర్: ఫలని కార్తీక్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: తమన్

నిర్మాత: టీజీ విశ్వప్రసాద్

దర్శకుడు: మారుతి

ప్రభాస్ సినిమా అంటేనే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందులోనూ హారర్ ఫ్యాంటసీ జానర్ కావడంతో ‘ది రాజా సాబ్’పై ఆసక్తి ఇంకా పెరిగింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందా..? ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులను మెప్పించిందా? రివ్యూలో చూద్దాం.

కథ:

జమీందారీ వైభవాన్ని, ఆస్తులను కోల్పోయి సాదాసీదా జీవితం గడుపుతున్న యువకుడే రాజు అలియాస్ రాజా సాబ్ (ప్రభాస్). అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న తన నానమ్మ గంగమ్మ (జరీనా వాహబ్) బాగోగులు చూసుకోవడమే రాజు ప్రపంచం. అయితే గంగమ్మ మాత్రం గతం తాలూకు జ్ఞాపకాల్లోనే జీవిస్తుంటుంది. తన యవ్వనంలో అమ్మవారి ఆభరణాలు వెతికి తెస్తానని వెళ్లిన తన భర్త కనకరాజు (సంజయ్ దత్) ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఆమె వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా తాత ఫోటో కంటపడటంతో, ఆయన్ని వెతికి పట్టుకునేందుకు రాజు హైదరాబాద్ బయలుదేరుతాడు. ఈ అన్వేషణలో ఉండగానే బెస్సి (నిధి అగర్వాల్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. కానీ ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచే లోపే భైరవి (మాళవిక మోహనన్) కథలోకి ఎంటర్ అవుతుంది. అసలు హైదరాబాద్ వచ్చిన రాజుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? కనకరాజుకు, గంగరాజు (సముద్రఖని)కు మధ్య ఉన్న వైరం ఏంటి..? చివరికి రాజు తన తాత ఆచూకీ కనుక్కున్నాడా..? తన నానమ్మ నిరీక్షణకు తెరదించి.. తాతను ఆమె దగ్గరకు చేర్చగలిగాడా? అనే విషయాలు తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే.

కథనం:

‘ది రాజా సాబ్’ కోసం ఎంచుకున్న పాయింట్ చాలా బలంగా ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ హారర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ ఇది. కానీ, పేపర్ మీద ఉన్నంత స్ట్రాంగ్‌గా తెరమీదకు రాలేదనిపిస్తుంది. రైటింగ్ చాలా చోట్ల తేలిపోయింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఒక ఫ్లోలో కాకుండా.. అక్కడక్కడా అతికించినట్లుగా అనిపించడం సినిమాకు పెద్ద మైనస్. కొన్ని సీక్వెన్స్ లు బాగున్నా, ఓవరాల్ గా సినిమాను నిలబెట్టడంలో డైరెక్షన్ టీమ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. కాకపోతే వింటేజ్ ప్రభాస్ ను గుర్తు చేసేలా ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉన్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ తో వచ్చే రొమాంటిక్ సీన్స్ లో ప్రభాస్ ఈజ్ కనిపించింది. అలాగే కొన్ని సీన్స్ లో ఒకప్పటి రెబల్ స్టార్ కనిపించదు.

ఇక మారుతి విషయానికి వస్తే.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు ఏదో మాయ చేయాలని చూసినా వర్కవుట్ అవ్వలేదు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకున్నా.. అంతే ఆసక్తికరంగా చెప్పడంలో ఎక్కడో మిస్ ఫైర్ అయింది రాజా సాబ్. ఫస్ట్ 10 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మంచి సీన్‌తో బ్రేక్ ఇచ్చాడు మారుతి. సెకండాఫ్ అంతా కోటలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ పర్లేదు.. కొన్ని సీన్స్ ఎంజాయ్ చేయొచ్చు. చివరి అరగంట సినిమా అంతా హెల్యూజినేషన్ చుట్టూ తిరుగుతుంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే.. చివరి 25 నిమిషాలు మరో ఎత్తు. క్లైమాక్స్ ఎపిసోడ్ ను చాలా సాలిడ్ గా ఎగ్జిక్యూట్ చేశారు. అక్కడ నేనొక్కడినే సినిమా గుర్తుకొస్తుంది. రొటీన్ గా కాకుండా కొత్తగా ట్రై చేసిన హారర్ ఫ్యాంటసీ ఐడియా ఇది. అయితే కథనం అంత గ్రిప్పింగ్ గా లేదు, అక్కడక్కడా సాగదీసినట్లు అనిపిస్తుంది. దానికి తోడు ట్రైలర్ లో చూపించి ఆసక్తి రేకెత్తించిన ‘ముసలి గెటప్’ సినిమాలో లేకపోవడం పెద్ద డిసప్పాయింట్మెంట్. అది మేజర్ మిస్‌స్టెప్ అని చెప్పొచ్చు.

నటీనటులు:

చాలా కాలం తర్వాత ప్రభాస్ ను ఇంత ఎనర్జిటిక్ గా చూడటం ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ రిఫ్రెషింగ్ గా ఉంది. ఇక నిధి అగర్వాల్ తో ప్రభాస్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద చాలా బాగా వర్కౌట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ పర్లేదు. సంజయ్ దత్ విలనిజం బాగా పండించాడు. జరినా వహాబ్ నాన్నమ్మ పాత్ర బాగుంది. మిగిలిన పాత్రలు ఓకే..

టెక్నికల్ టీం:

తమన్ అందించిన మ్యూజిక్ సినిమాను ముందుకు నడిపించడంలో హెల్ప్ అయ్యింది. అక్కడక్కడా లౌడ్ మ్యూజిక్ వినిపించింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో మాత్రం మిశ్రమ స్పందన వస్తుంది. కొన్ని చోట్ల గ్రాఫిక్స్ బాగున్నా, కొన్ని కీలక సన్నివేశాల్లో మాత్రం తేలిపోయాయి. క్వాలిటీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎడిటింగ్ ఇంత నిడివి ఉండాల్సింది కాదు. మారుతి హారర్ లో కొత్త కాన్సెప్ట్ ట్రై చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా రాజా సాబ్.. it’s మారుతి మైండ్ గేమ్..!