Bigg Boss 5 Telugu: నేను నీతో ఎప్పుడు మాట్లాడాను.. షణ్ముఖ్‌కు షాక్ ఇచ్చిన రవి..
బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ భారీ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, అల్లర్లు నానా హంగామాగా ఉంది బిగ్ బాస్ హౌస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ భారీ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, ఏడుపులు, అల్లర్లు నానా హంగామాగా ఉంది బిగ్ బాస్ హౌస్. ఇక ఇప్పటికే హౌస్ నుంచి ముగ్గురు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లిపోయారు. ఇక ఉన్న హౌస్ మేట్స్‌లో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారు.. ఈ క్రమంలో ఈ వారం నటరాజ్ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి, సన్నీ, యానీ మాస్టర్.. మొత్తం 8 మంది ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఈ ఎనిమిది మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఉత్కంఠగా మారింది. పై ఎనిమిది మందిలో సన్నీ, ప్రియ, యాంకర్ రవి, సిరిలకు ఎలాంటి ఢోకా లేదు. వీరు సేఫ్ జోన్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా సభ్యులు.. లోబో.. నటరాజ్ మాస్టర్, కాజల్, యానీ మాస్టర్ డేంజర్ జోన్లో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా నేటి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఇక ఈ ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ మేట్స్‌కు టాస్క్ ఇచ్చారు. చెక్కలను గొడ్డలితో నరకాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికోసం ప్రియా, ప్రియాంక, విశ్వ ముగ్గురు ప్రయత్నించారు. అలాగే నటరాజ్ మాస్టర్- లోబో మధ్య ఫన్నీ డిస్కషన్ నడిచింది. నటరాజ్ మాస్టర్ లోబోకి ఓ సామెత చెప్పాడు.. ఏడూ సముద్రాలూ దాటి ఇంటిముందున్న మురికికాలువలో కాలు పెట్టాడట అంటూ చెప్పగానే లోబో నవ్వేశాడు. అలాగే ఇంటిసభ్యులకోసం మటన్ బిర్యానీ పంపాడు బిగ్ బాస్. అలాగే రవి- షణ్ముఖ్ మాట్లాడుకుంటుండగా టాస్క్‌లు ఆడుతుండగా నేను ఎందుకో ఇన్ఫులెన్స్ అవుతున్నా అనిపిస్తుంది అంటూ చెప్తాడు.. దానికి రవి నేను నీతో ఎప్పుడు మాట్లాడాను అంటూ సమాధానం ఇచ్చాడు. ఆతర్వాత సన్నీ మానస్ కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లగా ఛాలెంజ్ కోసం ఒక జంటను ఎంచుకోండి అని చెప్పగా ఎవరిని ఎంచుకున్నారన్నది సస్పెన్స్‌గా ఉంచారు. అయితే చివరిలో సిరి ఏడవడం చూపించారు.. దాంతో నేటి ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగింది.
మరిన్ని ఇక్కడ చదవండి :