Pawan Kalyan : నేను డబ్బులు సంపాదించుకోలేక కాదు.. నా ధనం ధైర్యం.. ద్రవ్యం కాదు : పవన్ కళ్యాణ్
వైసీపీ నాయకులపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.. మేము ప్రశ్నిస్తుంటే.. మమ్మల్ని వ్యక్తిగత విషయాలపై నీచంగా మాట్లాడుతున్నారు అని పవన్ అన్నారు..
Pawan Kalyan : వైసీపీ నాయకులపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు.. మేము ప్రశ్నిస్తుంటే.. మమ్మల్ని వ్యక్తిగత విషయాలపై నీచంగా మాట్లాడుతున్నారు అని పవన్ అన్నారు.. అలాగే ఆయన మాట్లాడుతూ.. ‘మెమోస్తున్నాం అంటే రోడ్లు వేస్తారా..? రెండు రోజుల్లో 7 కిలోమీటర్ల రోడ్డు వేశారు.. మేము మిమ్మల్ని నమ్మాలా..? అని ప్రశ్నించారు. ‘ మీ కింద ఎంత కిరాయి సైన్యం ఉన్నా భయపడేది లేదు. తోడేళ్ళ గుంపు గొర్రెలకు కాపలా కాస్తమంటే నమ్ముతామా..? వైసీపీ నాయకులూ అవినీతి లేకుండా పాలనా చేస్తా మంటే నమ్ముతామా.. అంటూ జనసేనాని ఫైర్ అయ్యారు. వ్యక్తిగతంగా , ఇంటి ఆడపడుచుల గురించి ఇంత దిగజారి మాట్లాడాలా.. మీకు ఆడవాళ్లు ఉన్నారుగా.. నేను మీఇంటి ఆడవాళ్లను గౌరవిస్తా..అన్నారు.
నాకు పాలకులతో ఎప్పుడూ సమస్యే.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలు బాధ్యత ఎలా వహిస్తారు.. రాష్ట్ర విభజన సమయంలో నాకు చాలా భయం వేసింది.. 10 ఏళ్ళు ఆంధ్రపాలకులు చేసిన పనులకు ప్రజలు తిట్లు తిన్నారు.. అన్నారు పవన్.. పాలకులు చేసిన తప్పులకు ప్రజలను శిక్షించకండి అన్నారు. అలాగే అన్నం ఉండికిందా అని ఒక చిన్న మెతుకు పట్టుకుంటే చాలు.. వైసీపీ పాలనా ఎలా ఉందొ ఆదిలోనే తెలిసిపోయింది అని పవన్ విమర్శించారు. నేను ప్రజల బాగుకోసమే రాజకీయాల్లోకి వచ్చాను… నేను అడ్డగాడిదలతో తిట్లుతినడానికి నాకేమైనా సరదానా.. నాకు చాలా పౌరుషం ఉంది కానీ నేని ప్రజలకోసం నా పౌరుషాన్ని తగ్గించుకుంటున్నా అన్నారు.
2014లో తెలుగు దేశం పార్టీ తరపునా చంద్రబాబు గారే నా ఆఫీస్ కు వచ్చారు. జనసైనికులు బిర్యానీ ప్యాకెట్ కో సారా ప్యాకెట్ కో వచ్చేవాళ్ళు కాదు.. అందుకే చంద్రబాబునే నా దగ్గరకు రమ్మన్నాను. ఎందుకంటే నాకు పొగరు కాదు.. జన సైనికులు ఎక్కడా తక్కువ కాకూడదని.. అన్నారు. అదేవిధంగా.. నేను డబ్బులు సంపాదించుకోలేక కాదు.. ఎకరం లక్ష ఉన్నప్పుడే నా సంపాదన కోటి రూపాయలు.. కానీ నేను ఎప్పుడు డబ్బు వెంట పడలేదు.. నా ధనం ధైర్యం.. ద్రవ్యం కాదు.. ప్రజలు నా నుంచి చాలా ఆశించారు అని అన్నారు. ఇక వైసీపీకి వర్గశత్రువు కమ్మవారు.. నన్ను కూడా అడిగారు జనసేనకు వర్గ శత్రువు ఎవరు.? అని అడిగితే నేను చెప్పలేక పోయాను.. నిజమైన వర్గ శత్రువు ఎవరంటే.. పేదరికం, అవినీతి, దాష్టీకం, దారిద్యం ఇవి వర్గ శత్రువు అంటే.. వైసీపీ 151 సీట్లు వస్తే వైసీపీ ఎంత ప్రగతి సాధిస్తే ఎలా ఉండేది.. కానీ మేము చంపేస్తా అంటే ఎలా.. తన మన భేదం లేకుండా పోతే ఆపాల్సిన అవసరం ఉంది అన్నారు పవన్. అలాగే జనసేనకు.. దాష్టీకం,, దౌర్జనం జనసేనకు వర్గ శత్రువులు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :