Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PelliSandaD : పెళ్ళిసందడి నుంచి మరో అందమైన పాట.. రవితేజ చేతులమీదుగా ‘మధురాపురి’ సాంగ్..

సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా పెళ్ళిసందడి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది.

PelliSandaD : పెళ్ళిసందడి నుంచి మరో అందమైన పాట.. రవితేజ చేతులమీదుగా 'మధురాపురి' సాంగ్..
Shreeleela
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Sep 29, 2021 | 4:12 PM

PelliSandaD : సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న సినిమా పెళ్ళిసందడి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటివే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు విపరీతమైన రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమానుంచి మరో అందమైన పాటను విడుదల చేశారు. కీరవాణి బాణీలను సమకూర్చగా.. ఈపాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. రవితేజ చేతుల మీదుగా ఈ సాంగ్ విడుదల చేశారు.

రవితేజ ఈపాటను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా నుంచి ఇంత వరకూ వచ్చిన ప్రతి అప్ డేట్ అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఇప్పుడు ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ పాటను శ్రీనిధి, కాలభైరవ, నయన నాయర్ కలిసి ఆలపించారు. ఇక గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. నేటి తరం దర్శకులు చాలామంది ఆయనను ఆదర్శంగా తీసుకుంటారు. అందుకే ఆయన దర్శకేంద్రుడు అయ్యారు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించారు రాఘవేంద్రరావు. రాఘవేంద్ర రావు చాలా కాలం గ్యాప్ తర్వాత దర్శకత్వ పర్యవేక్షణ అందించడమే కాకుండా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ పెళ్ళిసందడిలో.. శ్రీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన పెళ్ళిసందడి టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా రోషన్ కెరీర్‌‌‌కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Upasana Konidela: ఉపాసన స్టైలే వేరు.. బాధ్యతలే కాదు.. జంతువుల పరిరక్షణలోనూ మెగా కోడలు నెంబర్ వన్..(ఫొటోస్)

ఈ ఫోటోలో ఉన్న క్యూట్ కపుల్ ఎవరో గుర్తుపట్టగలరా ? ఈ జంటకు సోషల్ మీడియాలో క్రేజ్ మాములుగా ఉండదు..

Allu Arjun: అల్లు అర్జున్‏కు అరుదైన బహుమతి.. 160 ఏళ్ల పురాతన కానుక ఇచ్చి అభిమానాన్ని చాటుకున్న కేరళ మిలియనీర్..