Dil Raju: రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీకి చాలా సహకారం అందించాయన్న దిల్ రాజు..
జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.
Dil Raju: జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఏపీ సర్కారుపైనా, మంత్రి పేర్ని నానిపైనా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీనిపై పేర్ని నాని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.. పవన్ కిరాయి రాజకీయ పెట్టారని ఆరోపించారు. రాజకీయ పార్టీని టెంట్‌హౌస్‌లా అద్దెకు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తాజాగా పలువురు నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలిశారు. ఈ సంధర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘కరోనా పాండమిక్ సమయంలో ఇండస్ట్రీ పెద్దలు కొందరు కలిసి.. ఆ సమయంలో ఉన్న సమస్యలను సీఎం జగన్ కు వివరించారు అని గుర్తు చేశారు. ఆయన ఎంతో సానుకూలంగా స్పందించి.. సంబంధిత అధికారులతో మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారాన్ని చేపడతామని చెప్పారు అన్నారు. ఆ తర్వాత మా సినిమా వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడు జీవోలు రావడంలాంటివి జరగడంతో… డిస్కషన్ వేరేవిధంగా వెళ్ళింది అన్నారు. సినిమా అనేది చాలా సున్నితమైనది… ఎక్కడ ఏ చిన్నది జరిగిన అది మా సినిమా ఇండస్ట్రీ పైనే పడుతుంది. దానివల్ల నిర్మాతలు, నటీనటులు, డిస్టిబ్యూటర్స్ పై ప్రభావం పడుతుంది. ప్రభుత్వాలకు రాజకీయనాయకులకు మీడియా వారికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే.. దయచేసి సినిమాను సున్నితమైన విధంగా హ్యాండిల్ చేయండి అని దిల్ రాజు అన్నారు.
అలాగే రెండు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి చాలా సహకారం అందిస్తున్నాయి.. ఏపీ ప్రభుత్వం మా సమస్యల పరిష్కారానికి సాయం చేస్తామని చెప్పారు అని తెలిపారు దిల్ రాజు. అయితే మేము దానిని సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరికి కన్వే చేయలేకపోయాం.. దానివల్ల ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఈ వివాదాలు జరుగుతున్నాయి. మేము ఇప్పుడు మరోసారి మంత్రిగారితో మాట్లాడి మా సమస్యలపై సీఎంగారితో చర్చించామని అడగటానికి వచ్చాం..అని స్పష్టం చేశారు దిల్ రాజు. దయచేసి వివాదాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగకండి… రాజకీయాలు వేరు… సినిమాలు వేరు దయచేసి రెండు కలిపి చూడకండి అని విజ్ఞప్తి చేశారు దిల్ రాజు.
మరిన్ని ఇక్కడ చదవండి :