Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో మాస్ రాజా.. చిరు నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్రలో రవితేజ..!!

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Chiranjeevi : మెగాస్టార్ సినిమాలో మాస్ రాజా.. చిరు నటిస్తున్న ఆ సినిమాలో కీలక పాత్రలో రవితేజ..!!
Megastar
Follow us

|

Updated on: Sep 29, 2021 | 7:35 PM

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమాలో చిరుతోపాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చిరుకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తుంది. మరి కొద్దిరోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వనుంది. ఆ తర్వాత చిరంజీవి తన తదుపరి సినిమాగా ‘గాడ్ ఫాదర్’ చేస్తున్నారు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. మలయాళంలో మంజువారియర్ చేసిన పాత్ర ద్వారా సీనియర్ హీరోయిన్ శోభన రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ డైరెక్షన్ లో బోళాశంకర్ అనేసినిమా చేస్తున్నారు మెగాస్టార్. అలాగే బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు చిరు. ఈ సినిమాకు ‘వాల్తేర్ వీర్రాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. . వైజాగ్‌లో తొలి షెడ్యూల్‌‌‌ను ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రవితేజను సంప్రదిస్తున్నారని తెలుస్తుంది. మెగాస్టార్ అంటే మొదటినుంచి అభిమానమున్న మాస్ రాజా సినిమా చేయడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది. గతంలో చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ .. ‘శంకర్ దాదా జిందాబాద్’  సినిమాల్లో కనిపించాడు రవితేజ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bigg Boss 5 Telugu: నేను నీతో ఎప్పుడు మాట్లాడాను.. షణ్ముఖ్‌కు షాక్ ఇచ్చిన రవి..

AP Politics: రాజకీయ పార్టీని టెంట్‎హౌస్‎లా అద్దెకు ఇస్తున్నారు.. మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan : నేను డబ్బులు సంపాదించుకోలేక కాదు.. నా ధనం ధైర్యం.. ద్రవ్యం కాదు : పవన్ కళ్యాణ్

Pawan Kalyan : భగత్ సింగ్‌‌‌కు జోహార్లు అర్పిస్తాం.. గాంధీజీ ముందు మోకరిల్లుతాం.. మీలాంటి వాళ్లను తాటతీస్తాం : పవన్ కళ్యాణ్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు