AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathika Rose: బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. రతికాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్

సైడ్ క్యారెక్టర్స్ తో పలు సినిమాల్లో మెప్పించింది రతిక. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే పటాస్ షో ద్వారా స్టాండప్ కామెడీ చేసి క్రేజ్ తెచ్చుకుంది రతిక. ఆతర్వాత మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఇక వచ్చి రాగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ అయ్యి..

Rathika Rose: బిగ్ బాస్ బ్యూటీకి బంపర్ ఆఫర్.. రతికాకు హీరోయిన్‌గా ఛాన్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Rathika Rose
Rajeev Rayala
|

Updated on: Oct 16, 2023 | 9:29 AM

Share

బిగ్ బాస్ సీజన్ 7 లో చాలా మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. వారిలో రతికా రోజ్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ హౌస్ లోకి వచ్చిన దగ్గర నుంచి తన గేమ్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సైడ్ క్యారెక్టర్స్ తో పలు సినిమాల్లో మెప్పించింది రతిక. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయ్యే పటాస్ షో ద్వారా స్టాండప్ కామెడీ చేసి క్రేజ్ తెచ్చుకుంది రతిక. ఆతర్వాత మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. సినిమాల్లో చిన్న చిన్న పత్రాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఇక వచ్చి రాగానే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తో క్లోజ్ అయ్యి మనోడిని ముగ్గులోకి దింపేసింది. దాంతో రైతు బిడ్డ కాస్త రతికా భజన చేస్తూ ఆమె చుట్టూ తిరుగుతూ ప్రేక్షకులకు చిరాకు తెప్పించాడు. ఆతర్వాత ఆమె ఉన్నట్టుంది ప్రశాంత్ పై రివర్స్ అవ్వడంతో సీన్ రివర్స్ అయ్యింది. ఆతర్వాత యావర్ తో పులిహోర కలిపింది రతిక..

అంతే కాదు హౌస్ లో ఉన్నవాళ్లందరితో గొడవలు పెట్టుకొని రచ్చ చేసింది. ఇక రతిక ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈ అమ్మడికి అదృష్టం తలుపు తట్టింది. హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఏకంగా స్టార్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ అందుకుంది.

రతికా హీరోయిన్ గా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎమోషనల్ లవ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు రాఘవేంద్రరావు. ఇక ఈ సినిమాలో లీడ్ రోల్ లో రతికా నటించనుంది. రతికా మాట్లాడుతూ.. నా కల నెరవేరింది అనిపిస్తుంది. లెజెండ్రీ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో సినిమా చేయడం నా అదృష్టం. నా ఫోటోలు, నేను నటించిన సినిమాల్లోని సీన్స్ చూసి ఆయన ఈ పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి నన్ను సెలక్ట్ చేశారు. ఇదొక ఎమోషనల్ లవ్ డ్రామా. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకు వస్తాయి అని తెలిపింది.

రతికా రోజ్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!