Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. ఎలిమినేట్‌ అయ్యింది జెస్సీనే.. ఫైనల్‌కు వచ్చేది ఎవరో చెప్పకనే చెప్పాడుగా..

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ఆదివారం ఊహించినట్లుగానే అద్భుతం జరిగింది. అనారోగ్యం కారణంగా నామినేషన్‌లో లేకపోయినప్పటికీ జెస్సీ హౌజ్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నిజానికి అందరి కంటే...

Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. ఎలిమినేట్‌ అయ్యింది జెస్సీనే.. ఫైనల్‌కు వచ్చేది ఎవరో చెప్పకనే చెప్పాడుగా..
Biggboss 5 Telugu
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2021 | 6:39 AM

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో ఆదివారం ఊహించినట్లుగానే అద్భుతం జరిగింది. అనారోగ్యం కారణంగా నామినేషన్‌లో లేకపోయినప్పటికీ జెస్సీ హౌజ్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. నిజానికి అందరి కంటే కాజల్‌కు ఓట్లు తక్కువగా పడ్డాయి. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది కాజల్‌ అంటూ వార్తలు వచ్చాయి. కానీ జెస్సీ పోతూ పోతూ కాజల్‌కు ఛాన్స్‌ ఇచ్చినట్లు అయ్యింది. దీంతో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో జెస్సీ అందరికీ వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే హౌజ్‌నుంచి వెళ్లి పోయే ముందు జెస్సీకి బిగ్‌బాస్‌ హౌజ్‌మేట్స్‌తో మాట్లాడే అవకాశం ఇచ్చాడు. బహిరంగంగా కాకుండా ఫోన్‌లో వన్‌ టు వన్‌ మాట్లాడే ఛాన్స్‌ ఇచ్చాడు. దీంతో జెస్సీ తన హౌజ్‌మేట్స్‌కి విలువైన సలహాలతో పాటు కొన్ని హెచ్చరికలు కూడా చేశారు.

ఇందులో భాగంగా సన్నీతో మాట్లాడుతూ.. జాగ్రత్తగా ఉండమని, ఎట్టిపరిస్థితుల్లో టెంపర్‌ లూజ్‌ కావొద్దని సూచన చేశాడు. ఒక్కడిగా గేమ్‌ ఆడితే హీరో అవుతావని, లేదంటే కమెడియన్‌ అవుతావని చెప్పుకొచ్చాడు. ఇక మానస్‌ను సైలెంట్‌ కిల్లర్‌ అన్న జెస్సీ.. రవికే బాబు అంటూ కామెంట్ చేశాడు. అందరినీ నెగెటివ్‌గా చూడకంటూ సూచన చేశాడు. ఇక కాజల్‌కు ఒక రకంగా క్లాస్‌ ఇచ్చాడు జెస్సీ.. పక్కవాళ్లను హైలైట్‌ చేయడానికి బిగ్‌బాస్‌లోకి రాలేదని, నీ ఫ్రెండ్స్ నీకు విలువ ఇస్తున్నార‌నుకుంటున్నావు, కానీ ఇవ్వట్లేదు. నిన్ను వాడుకుంటున్నారు అది తెలుసుకో అని సలహా ఇచ్చాడు.

ఇక శ్రీరామ్‌ టాప్‌5లో ఉంటాడని అభిప్రాయపడ్డ జెస్సీ.. రవిని ఫైన్‌లో కలుస్తానని చెప్పడం విశేషం. అంటే రవి ఫైనల్‌కు వస్తాడని చెప్పకనే చెప్పేశాడు. ఇక సిరిని వచ్చే వారమే బయటకు వచ్చేయకు అని ఫైనల్‌ వరకు ఉండమని చెప్పాడు. ఇక బెస్ట్‌ ఫ్రెండ్ అయిన షణ్ముఖ్‌ను విడిచి వెళ్లే సమయంలో జెస్సీ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. హౌజ్‌లో ఉన్న చివరి రోజుల్లో నీతో ఉండలేకపోయానన్నదే నా బాధ.. నేను ఎప్పటికీ నీ సీక్రెట్‌ ఫ్రెండ్‌ని అన్నాడు. ఇక షణ్ముఖ్‌ మాట్లాడుతూ.. పదో వారంలో ఒకరికి లైఫ్‌ ఇచ్చి వెళ్లిపోతున్నావ్‌.. అదిరా నా జెస్సీ పొగిగాడు. ఇలా బిగ్‌బాస్‌ హౌజ్‌ నుంచి జెస్సీ తన జర్నీని ముగించాడు.

Also Read: Gujarat Man: యూట్యూబ్ వీడియోలు చూసి డ్రగ్స్ తయారుచేస్తున్న యువకుడు.. ఆఫీసునే ల్యాబ్ గా మార్చిన వైనం.. ఎక్కడంటే..

భార్యకు ప్రేమతో.. చనిపోయినా ఇంట్లో ఉంచి పూజలు.. వీడియో

పెళ్లికి వచ్చే బంధువులు, స్నేహితులకు వింత కండీషన్‌ పెట్టిన వధువు.. వీడియో