Karthikeya: రాజా విక్రమార్కుడి పెళ్లి ముహూర్తం అప్పుడే.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న శుభలేఖ..
ఇటీవల 'రాజా విక్రమార్క' సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరో కార్తికేయ. తాన్యా రవిచంద్రన్ , సాయికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది..

ఇటీవల ‘రాజా విక్రమార్క’ సినిమాతో మన ముందుకు వచ్చాడు హీరో కార్తికేయ. తాన్యా రవిచంద్రన్ , సాయికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. కాగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లోనే తన ప్రియురాలు లోహితకు లవ్ ప్రపోజల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు కార్తికేయ. అంతకుముందు నిశ్చితార్థం వేడుకలో ఇద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. తాజాగా వీరిద్దరి పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్సైంది. నవంబర్ 21(ఆదివారం)న ఉదయం 9 గంటల 47 నిమిషాలకు లోహిత మెడలో మూడు ముళ్ళు వేయనున్నాడట కార్తికేయ. దీనికి సంబంధించిన శుభలేఖ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే తమ పెళ్లి ముహూర్తానికి సంబంధించి కార్తికేయ, లోహిత కుటుంబ సభ్యులు ఎటువంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.
కార్తికేయ-లోహిత 2010లో మొదటిసారిగా కలుసుకున్నారు. వరంగల్ నిట్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఇంజినీరింగ్ కోర్సు చదివేటప్పుడు ఒకరికొకరు పరిచయమయ్యారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే 2018లో ‘ఆర్ ఎక్స్ 100’ తో పరిచయమైన కార్తికేయ ఎప్పుడూ తన ప్రేమ విషయం గురించి బయటకు వెల్లడించలేదు. ఈ ఏడాది ఆగస్టులో తన ప్రియురాలితో ఏకంగా ఉంగరాలు మార్చుకుని ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ‘రాజా విక్రమార్క’ సక్సెస్‌ను ఆస్వాదించే పనిలో ఉన్నాడీ హీరో. అజిత్ హీరోగా తెరకెక్కుతోన్న ‘వలిమై’ సినిమాతో త్వరలో తమిళ తెరపై కూడా మెరవనున్నాడు.
Also Read:
విహారయాత్రలో మతి పోగొడుతున్న ‘బుట్టబొమ్మ’.. ఫొటోలపై ఓ లుక్కేయండి..
Anasuya Bharadwaj: నెక్ట్స్ లెవల్ అందాలతో ఫాన్స్ ని ఫిదా చేస్తున్న అనసూయ..