Bigg Boss 4: ‘బిగ్‌బాస్ 4’ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!
బుల్లితెర వీక్షకులు బిగ్‌బాస్ 4 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించి ప్రోమోలు కూడా విడుదల కావడంతో ఎప్పుడెప్పుడు

Bigg Boss 4 Telugu: బుల్లితెర వీక్షకులు బిగ్‌బాస్ 4 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సీజన్‌కి సంబంధించి ప్రోమోలు కూడా విడుదల కావడంతో ఎప్పుడెప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుందా..! అన్న ఆసక్తి వారిలో రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ షో ప్రారంభానికి సంబంధించిన ఓ వార్త టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ షోకు సంబంధించి నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్ చేశారట.
మొత్తం 16 మందిని వీరు ఎంపిక చేశారట. కరోనా నేపథ్యంలో వీరందరిని పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచారట. 14 రోజుల క్వారంటైన్ తరువాత మళ్లీ పరీక్షలు చేసి ఆ తరువాత వారిని హౌజ్‌లోకి పంపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగష్టు 30 నుంచి బిగ్‌బాస్ 4 ప్రారంభం కావొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వికీపీడియాలో సైతం బిగ్‌బాస్ 4 ఆగష్టు 30న ప్రారంభం కానుందని, మొత్తం 15 మంది ఇందులో పాల్గొనబోతుండగా, 105 రోజులు షో ఉండబోతున్నట్లు రాసుకొచ్చారు.
కాగా ఈ సీజన్‌లో జబర్దస్త్ కెవ్వు కార్తీక్, సింగర్ నోయల్ సేన్, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్‌లు కంటెస్టెంట్‌లుగా ఉండబోతున్నట్లు సమాచారం.
Read More:



