AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ఏక్ విలన్’ సీక్వెల్‌లో అర్జున్ కపూర్..

బాలీవుడ్ ఇండస్ట్రీలో అటు మ్యూజిక్ పరంగా.. ఇటు కంటెంట్ పరంగా హిటైన సినిమా 'ఏక్ విలన్'. 2014లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్దా కపూర్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

'ఏక్ విలన్' సీక్వెల్‌లో అర్జున్ కపూర్..
Ravi Kiran
|

Updated on: Aug 23, 2020 | 1:35 PM

Share

Ek Villain 2 Movie: బాలీవుడ్ ఇండస్ట్రీలో అటు మ్యూజిక్ పరంగా.. ఇటు కంటెంట్ పరంగా హిటైన సినిమా ‘ఏక్ విలన్’. 2014లో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్దా కపూర్, రితేష్ దేశ్‌ముఖ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డాడు దర్శకుడు.

జాన్ అబ్రహం హీరోగా నటించనున్న ఈ సీక్వెల్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే మొదటిగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం ఆదిత్య రాయ్ కపూర్‌ను సంప్రదించగా.. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల అతడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దీనితో ఇప్పుడు అతడి స్థానంలో హీరో అర్జున్ కపూర్ విలన్‌గా కనిపించానున్నాడు. దిశా పటానీ, తారా సుతారియా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ కపూర్ మూడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నాడు. అంతేకాకుండా జాన్ అబ్రహం, అర్జున్‌ల మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ మూవీలో ఉండనున్నాయని బీ-టౌన్ టాక్.

Also Read:

ఓటీటీలో సూర్య ‘ఆకాశమే నీ హద్దురా’..

మానవత్వం చాటుకున్న హీరో సూర్య..