బిగ్‌బాస్ సీజన్-3లో ఉండేది వీళ్లే.. ఈ లిస్ట్ ఫిక్స్..!

బిగ్‌బాస్‌ సీజన్‌.. గత రెండేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. అదే పరంపరగా బిగ్‌బాస్-3 ఆదివారం జులై 21న ప్రారంభం కానుంది. దీనికి హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లితెరలోనూ.. అటు వెండితెరలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. హోస్ట్‌గా ఆయన ఎలా వ్యవహరించనున్నారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే.. అసలు సస్పెన్స్‌ అంతా బిగ్‌బాస్-3 హౌస్‌లో 100 రోజులు ఉండబోయే సెలబ్రెటీలు ఎవరన్నది. కాగా.. బిగ్‌బాస్-3లో ఉండబోయే 15 మంది సెలబ్రెటీలు […]

బిగ్‌బాస్ సీజన్-3లో ఉండేది వీళ్లే.. ఈ లిస్ట్ ఫిక్స్..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 20, 2019 | 12:03 PM

బిగ్‌బాస్‌ సీజన్‌.. గత రెండేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. అదే పరంపరగా బిగ్‌బాస్-3 ఆదివారం జులై 21న ప్రారంభం కానుంది. దీనికి హోస్ట్‌గా కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఆయన హోస్ట్‌గా వ్యవహరించడంతో బుల్లితెరలోనూ.. అటు వెండితెరలోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. హోస్ట్‌గా ఆయన ఎలా వ్యవహరించనున్నారో అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

అయితే.. అసలు సస్పెన్స్‌ అంతా బిగ్‌బాస్-3 హౌస్‌లో 100 రోజులు ఉండబోయే సెలబ్రెటీలు ఎవరన్నది. కాగా.. బిగ్‌బాస్-3లో ఉండబోయే 15 మంది సెలబ్రెటీలు వీళ్లే అని.. బిగ్‌బాస్-2 కంటెస్టెంట్ నూతన్ నాయుడు ఓ జాబితాను విడుదల చేశాడు.

ఓ కొత్త యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసిన నూతన్ నాయుడు.. ఒక్కొక్క సెలబ్రెటీ నేమ్, ఫొటోతో సహా రివీల్ చేశాడు. బిగ్‌బాస్ సీజన్-3లో ఉండబోయేది వీళ్లే అని బల్ల గుద్ది మారీ చేప్తున్నాడు. మీరు జస్ట్ వెయిట్ చేయడం అంతే.. నేను చెప్పే సెలబ్రెటీలే కనిపిస్తారు అని పేర్కొన్నాడు.

Also Read: ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు అసలు కారణమిదే: తేజ

నూతన్ నాయుడు అంచనా ప్రకారం బిగ్‌బాస్‌ షోలో ఉండే సెలబ్రిటీలు వీళ్లే : 1. సీనియర్ నటి హేమ, 2. యాంకర్ శ్రీముఖి, 3. తీన్మార్ యాంకర్ సావిత్రి, 4. నటి హిమజా రెడ్డి, 5. వరుణ్ సందేశ్, 6. వితికా షెరు (జంట), 7. సీరియల్ యాక్టర్ రవికృష్ణ, 8. టీవీ యాంకర్ అలీ రెజా, 9. టీవీ9 జర్నలిస్ట్ జాఫర్, 10. పునర్వీ భూపాలం, 11. కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, 12. సింగర్ రాహుల్, 13. యూట్యూబ్ స్టార్ మహేష్, 14. టీవీ నటి రోహిణి, 15. డస్మాష్ స్టార్ అషూ రెడ్డి.