‘మిస్టర్ కేకే’ మూవీ రివ్యూ

చిత్రం : ‘మిస్టర్ కేకే’ నటీనటులు: విక్రమ్ – అక్షర హాసన్ – అబి హసన్ తదితరులు సంగీతం: జిబ్రాన్ ఛాయాగ్రహణం: శ్రీనివాస్ కె.గుత్తా నిర్మాత: కమల్ హాసన్ – నరేష్ కుమార్ – శ్రీధర్ రచన- దర్శకత్వం: రాజేష్ ఎం.సెల్వ చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం.సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన క‌డ‌ర‌మ్ కొండాన్‌ చిత్రాన్ని తెలుగులో […]

'మిస్టర్ కేకే' మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Jul 20, 2019 | 9:23 AM

చిత్రం : ‘మిస్టర్ కేకే’

నటీనటులు: విక్రమ్ – అక్షర హాసన్ – అబి హసన్ తదితరులు సంగీతం: జిబ్రాన్ ఛాయాగ్రహణం: శ్రీనివాస్ కె.గుత్తా నిర్మాత: కమల్ హాసన్ – నరేష్ కుమార్ – శ్రీధర్ రచన- దర్శకత్వం: రాజేష్ ఎం.సెల్వ

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌హ‌స‌న్‌, అభిహ‌స‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం.సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రాజ్‌క‌మ‌ల్ ఫిల్మ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.ర‌విచంద్ర‌న్ బ్యాన‌ర్ పై రూపోందిన క‌డ‌ర‌మ్ కొండాన్‌ చిత్రాన్ని తెలుగులో మిస్టర్ కే కే గానిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు సంయుక్తంగా టి.అంజ‌య్య స‌మ‌ర్ప‌ణలో నిర్మాణ సంస్థ పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్‌ పై విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ లో విక్రమ్ ని ప్రెసెంట్ చేసిన, తీరు అలాగే సినిమాని మంచిగా ప్రమోట్ చేయడంతో అంచనాలు పెరిగాయి. మరి ఈ చిత్రం ఎంతమేర అలరించిందో  ఈ సమీక్షలో చూద్దాం.

కథ : వాసు (అభి హసన్‌), అధీరా (అక్షరా హసన్) పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని మలేషియా వెళ్లిపోతారు. ఓ హాస్పిటల్‌లో డాక్టర్‌ అయిన వాసు, అధీరా గర్భవతి కావటంతో నైట్‌ డ్యూటీస్‌కు వెళుతూ ఉదయం అధీరాకు తోడుగా ఉంటుంటాడు. అదే సమయంలో ఓ ఇండస్ట్రీయలిస్ట్‌ను చంపిన కేసులో ముద్దాయి అయిన కేకే (విక్రమ్‌) అదే హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. వాసు డ్యూటీలో ఉన్న సమయంలోనే కేకే పై హాత్యాయత్నం జరుగుతుంది. అప్పుడు వాసునే కేకేను కాపాడతాడు. కానీ కొంతమంది దుండగులు అధీరాను కిడ్నాప్‌ చేసి కేకేను హాస్పిటల్‌ నుంచి బయటకు తీసుకురావాలని వాసును బెదిరిస్తారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో వాసు.. కేకేను తప్పిస్తాడు. అసలు కేకే ఎవరు..? కేకేను విడిపించే ప్రయత్నం చేసింది ఎవరు..? ఇండస్ట్రియలిస్ట్ చావుకు కేకేకు సంబంధం ఏంటి? చివరకు అధీరా, వాసులు ఏమయ్యారు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ : కేవలం ఒక చిన్నపాయింట్‌ను తన స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో రెండు గంటల సినిమాగా మార్చే ప్రయత్నం చేసిన దర్శకుడు రాజేష్‌ ఎం సెల్వ. పూర్తిగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో థ్రిల్‌ చేసే అంశాలు పెద్దగా లేకపోవటమే పెద్ద మైనస్‌. అసలు కథ ప్రారంభించకుండానే ఫస్ట్ హాఫ్ పూర్తి కావటం ప్రేక్షకులకు నిరాశకలిగిస్తుంది. దీనికి తోడు సుధీర్ఘంగా సాగే సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి.  పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో జరిగే క్లైమాక్స్‌ సీన్‌ ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. కొన్ని ఫైట్స్‌, చేజ్‌ సీన్స్‌, హీరో ఎలివేషన్‌ షాట్స్‌  మెప్పిస్తాయి. సంగీత దర్శకుడు గిబ్రాన్‌ కొంత వరకు సినిమాను కాపాడే ప్రయత్నం చేశాడు. పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. మిగతా సాంకేతిక వర్గం పనితీరు బాగుంది.

నటీనటులు: కథల ఎంపికలోో పొరబాట్లు చేస్తాడు కానీ.. తనకు ఇచ్చిన పాత్ర ఏదైనా దానికి పూర్తి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాడు విక్రమ్. మరోసారి కథ విషయంలో ఆయన విఫలమయ్యాడు. కానీ కేకే పాత్రలో ఆయన పెర్ఫామెన్స్ అదుర్స్. విక్రమ్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. ఫిజిక్ అన్నీ కూడా పాత్రకు భలేగా సెట్టయ్యాయి. కానీ పాత్ర లుక్ మీద పెట్టినంత శ్రద్ధ.. క్యారెక్టర్ డిజైనింగ్ లో లేకపోవడమే బాధించే విషయం. అక్షర హాసన్ సినిమాలో ఉందంటే ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఆమె అభినయం బాగుందనిపిస్తుంది కానీ.. ఈ పాత్ర సినిమాకు కానీ.. ఈ పాత్ర వల్ల ఆమె కెరీర్ కు కానీ పెద్దగా ఉపయోగం లేదు. ఆమె భర్త పాత్రలో చేసిన కొత్త కుర్రాడు అబి హసన్ బాగా చేశాడు. మిగతా నటీనటులందరూ దాదాపుగా మనకు పరిచయం లేని వాళ్లే. ఎవరి పెర్ఫామెన్స్ ప్రత్యేకంగా చెప్పుకునేలా లేదు.

పైనల్ థాట్:

యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ స్టైలిష్‌గా ఉంది..బట్ థ్రిల్ మిస్సయ్యింది

నటుడిగా విక్రమ్ మరోసారి నటుడిగా హిట్..స్టోరీ సెలక్షన్‌లో మాత్రం యాజ్ యూజ్‌వల్ ఫ్లాప్