“ది లయన్ కింగ్” రివ్యూ

నటీనటులు : సింబా (నాని ), స్కార్ (జగపతి బాబు), ముఫాసా(రవి శంకర్) పుంబా , టిమోన్ దర్శకత్వం : జాన్ ఫెవ్ రూ నిర్మాత : డిస్నీ సంస్థ సంగీతం : జెఫ్ నితన్ సన్ పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ది లయన్ కింగ్’ సినిమా ఇప్పటికీ అన్ని ఇళ్లల్లో పిల్లల రాక్ లో భద్రం గా ఉంటుంది , అదే కోవకి చెందిన కొత్త సినిమా ది‘ లయన్ కింగ్’ కి ఒక ప్రత్యేకత […]

ది లయన్ కింగ్ రివ్యూ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 19, 2019 | 5:31 PM

నటీనటులు : సింబా (నాని ), స్కార్ (జగపతి బాబు), ముఫాసా(రవి శంకర్) పుంబా , టిమోన్

దర్శకత్వం : జాన్ ఫెవ్ రూ

నిర్మాత : డిస్నీ సంస్థ

సంగీతం : జెఫ్ నితన్ సన్

పాతికేళ్ల క్రితం వచ్చిన ‘ది లయన్ కింగ్’ సినిమా ఇప్పటికీ అన్ని ఇళ్లల్లో పిల్లల రాక్ లో భద్రం గా ఉంటుంది , అదే కోవకి చెందిన కొత్త సినిమా ది‘ లయన్ కింగ్’ కి ఒక ప్రత్యేకత వుంది. ఫోటో రియలిస్టిక్ టెక్నాలజీ తో ఈ సినిమాని రూపొందించారు . డిస్నీ సంస్థ నిర్మించిన ఈ సినిమా సమీక్ష ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం .

కథ : అడవిలో రాజు సింహం ( ముఫాసా ) రాణి సింహం (సరబి) కి కలిగిన సంతానం ‘సింబా’. ముఫాసా తమ్ముడు స్కార్ ఆ ఆడవికి రాజు కావాలని అనుకుంటున్నాడు. అయితే ముఫాసా వారసుడిగా సింబా రావడంతో.. అధికారం అతడి చేతుల్లోకి పోతుందన్న భయంతో స్కార్ కుట్ర పన్ని తన అన్న (ముఫాను)ను చంపేస్తాడు. దానికి కారణం సింబాగా అందరినీ నమ్మించి.. దాన్ని అడవి నుంచి వెళ్లిపోయేలా చేస్తాడు. అప్పటి నుంచి స్కార్ తన క్రూర ప్రవర్తనతో అడవిలోని జంతువులను హింసిస్తుంటాడు. మరోవైపు సింబా వేరే ప్రాంతంలో పెరుగుతాడు. అక్కడి జంతువులతో పెరిగిన సింబా మళ్లీ తన రాజ్యానికి ఎలా వచ్చి.. స్కార్‌తో ఫైట్ చేసి రాజుగా మారుతాడు అన్నది కథ.

విశ్లేషణ : ఈ సినిమాతో కళ్ల ముందు మరో అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించింది డిస్నీ సంస్థ. తప్పకుండా చూడాల్సిన సినిమాగా రూపొందించారు . యానిమేషన్స్ తో ఫోటో రియలిస్టిక్ టెక్నాలజీ తో ప్రతి పాత్ర చిత్రీకరణ అబ్బురపరిచేలా వుంది. ప్రాంతీయ భాషల్లో కూడా రావడంతో ఈ సినిమాకి మంచి ఆదరణ లభిస్తోంది . అదీ కాక వాయిస్ లు మన ఫేమస్ సినీ ప్రముఖులతో చెప్పించడంతో ఆ పాత్రలలో వాళ్ళ నే వూహించుకోడం వల్ల థ్రిల్ ఉంటుంది . సింబాకి నాని , స్కార్‌కి జగపతి బాబు, ముఫాసాకు రవిశంకర్ ఇచ్చిన వాయిస్ లు హై లైట్ అని చెప్పాలి . ఇక బ్రహ్మానందం , అలీ , రవిశంకర్ వాయిస్ లు అప్ట్ గా ఆ పాత్రలకి సెట్ అయినాయి . సింబా ప్రేయసి ‘నల’ అనే క్యారెక్టర్ కి సింగర్ లిప్సిక వాయిస్ అందించారు . కొన్ని సందర్భాలలో బాహుబలి కథ  గుర్హ్తోస్తూ ఉంటుంది కానీ , ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది . సినిమా మొదలైన దగ్గర నుండి ఆ అడవిలో ఆ జంతువులతో నే వాటి హావ భావాలతోనే మనమూ ఎమోషనల్ అవడం కచ్చితంగా కొత్తగా అనిపిస్తుంది .

టెక్నికల్ టీమ్ : దర్శకత్వం జాన్‌ ఫెవ్‌రూ చాల అద్భుతమైన ప్రతిభ కనపరిచాడు . సినిమాటోగ్రఫీ కెలాబ్ డిశ్చానల్ ప్రతి ఫ్రేమ్ లోను ఫీల్ ఉండేలా జాగ్రత్త పడి  చేసినట్టు అనిపిస్తుంది, మ్యూజిక్ హాన్స్ జిమ్మర్ చాలా చాకచక్యంగా ప్రేక్షకులను ట్రాన్స్ లోకి తీస్కెళ్ళేలా సంగీతం అందించాడు .  నాని, జగపతిబాబు, రవిశంకర్, అలీ, బ్రహ్మానందం వాయిస్ ల వల్ల  సినిమా ని మన ప్రేక్షకులు ఓన్ చేసుకుని చూడగలుగుతున్నారు . కుటుంబ సమేతంగా వెళ్లి వినోదం పంచుకోదగ్గ సినిమా.

ఫైనల్ థాట్ : కుటుంబ సమేతం గా పిల్లల్తో కలిసి చూడాల్సిన అద్భుత సృష్టి ‘ది లయన్ కింగ్’.