ఢిల్లీకి చేరిన తెలుగు ‘బిగ్‌బాస్’ లొల్లి..
తెలుగు బిగ్ బాస్ లొల్లి.. దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా బిగ్‌బాస్-3 చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. హైకోర్టు వరకూ ఈ రచ్చ చేరిన విషయం విదితమే. తాజాగా.. తెలుగు బిగ్ బాస్ రియాల్టి షోను నిలిపివేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, నటి గాయత్రీ గుప్తా, యాంకర్ శ్వేతారెడ్డి ధర్నా చేపట్టారు. బిగ్ బాస్ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని వీరు ధర్నా చేపట్టారు. బిగ్‌బాస్ ముసుగులో మహిళలు, ఆడ […]

తెలుగు బిగ్ బాస్ లొల్లి.. దేశ రాజధాని ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా బిగ్‌బాస్-3 చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. హైకోర్టు వరకూ ఈ రచ్చ చేరిన విషయం విదితమే. తాజాగా.. తెలుగు బిగ్ బాస్ రియాల్టి షోను నిలిపివేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, నటి గాయత్రీ గుప్తా, యాంకర్ శ్వేతారెడ్డి ధర్నా చేపట్టారు. బిగ్ బాస్ ప్రాసెస్‌లో అన్యాయం జరుగుతోందని వీరు ధర్నా చేపట్టారు.
బిగ్‌బాస్ ముసుగులో మహిళలు, ఆడ పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని, సెలక్షన్స్‌లో ఒక ప్రొడ్యూసర్ అసభ్యకరంగా మాట్లాడాడని గాయత్రీ గుప్తా, శ్వేతా రెడ్డి ఆరోపించారు. ‘మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే మాకేంటి అని’ కమిట్‌మెంట్స్ అడుగుతున్నారని వాపోయారు. కంపెనీలపై ఉన్న నమ్మకంతో అగ్రిమెంట్ కాపీలను తీసుకోలేదని.. ఈ సమస్యపై హీరో నాగార్జున స్పందించాలని వారు కోరారు. దేశ వ్యాప్తంగా బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయలన్నదే మా ప్రధాన డిమాండ్ అని అన్నారు. ఈ రియాల్టీ షోలో జరుగుతున్న లైంగిక వేధింపులపై దేశవ్యాప్తంగా మాకు సహకారం కావాలని వారు కోరారు.



