Bigg Boss : రిజల్ట్‌పై గరంగరం.. బిగ్ బాస్-14కు సల్మాన్ గుడ్ బై..!
Bigg Boss 14 : సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13 ముగిసింది. అనుకున్నట్లుగానే సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచారు. అయితే అతడికి అనుకూలంగా కొన్నాళ్లుగా ఛానెల్ యాజమాన్యం పక్షపాతంతో వ్యవహరించిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సల్మాన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్ల సమయంలో శుక్లా పక్షాన ఛానెల్ వకాల్తా పుచ్చుకుందా అని సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు […]
Bigg Boss 14 : సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన రియాలిటీ షో బిగ్ బాస్ 13 ముగిసింది. అనుకున్నట్లుగానే సిద్ధార్థ్ శుక్లా విజేతగా నిలిచారు. అయితే అతడికి అనుకూలంగా కొన్నాళ్లుగా ఛానెల్ యాజమాన్యం పక్షపాతంతో వ్యవహరించిందని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సల్మాన్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వీకెండ్ కా వార్ ఎపిసోడ్ల సమయంలో శుక్లా పక్షాన ఛానెల్ వకాల్తా పుచ్చుకుందా అని సల్మాన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాజాగా అందుతోన్న రిపోర్ట్స్ ప్రకారం ఈ సీజన్ విజేతను ప్రకటించే సమయంలో..ఛానెల్ సిద్దార్థ్ శుక్లాను రిఫర్ చేయడంతో..సల్లూ భాయ్ కోపంతో ఊగిపోయారట. అందుకే విజేత ప్రకటన ఆలస్యమయి..అర్థరాత్రి అనౌన్స్ చేయాల్సి వచ్చిందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇకపై షోకు హోస్టుగా పనిచేయనని తేల్చి చెప్పాడట. ఈ వార్తలు కొత్త కాకపోయినప్పటికి..ఈ సీజన్ సల్మాన్‌పై కాస్తంత ప్రతికూలత చూపిందన్న మాట మాత్రం వాస్తవం. కానీ ఈ ఏడాది షో 5 వారాలు పొడిగింపబడింది అంటేనే అర్థం చేసుకోవచ్చు.. ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో.
బిగ్ బాస్-13 లో సిద్దార్థ్ శుక్లా విజేతగా నిలవగా, అసిమ్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. షెహ్నాజ్ గిల్ మూడవ స్థానంలో ఉండగా… రాషమి దేశాయ్, ఆర్తి సింగ్ నాల్గవ స్థానంలో నిలిచారు. పరాస్ ఛబ్రా 10 లక్షల మనీ బ్యాగ్‌తో షో నుండి బయటకు వెళ్లి ఆరో స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ 13 అక్టోబర్ 2019 లో ప్రారంభమై.. ఫిబ్రవరి మధ్యలో ముగిసింది. షోను మరో రెండు వారాల పాటు పొడిగించాలనుకున్నప్పటికి, సల్మాన్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో మేనేజ్‌మెంట్ ఆ నిర్ణయాన్ని విరమించుకుంది.