Amala Paul : “నా విడాకులతో అతనికేం సంబంధం..?”

Amala Paul :  బోల్డ్ బ్యూటీ అమలాపాల్ ఏం చేసినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలే ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నటి..తాజాగా తన విడాకులకు సంబంధించి ఘూటు వ్యాఖ్యలు చేసింది. గతంలో అమలా.. డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలు కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. అంతా సైలెంట్‌గా సాగుతోన్న […]

Amala Paul : నా విడాకులతో అతనికేం సంబంధం..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 18, 2020 | 12:39 PM

Amala Paul :  బోల్డ్ బ్యూటీ అమలాపాల్ ఏం చేసినా సంచలనమే. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇటీవలే ‘ఆడై’ చిత్రంలో నగ్నంగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ నటి..తాజాగా తన విడాకులకు సంబంధించి ఘూటు వ్యాఖ్యలు చేసింది. గతంలో అమలా.. డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ మనస్పర్థలు కారణంగా రెండేళ్లకే విడిపోయారు. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. అంతా సైలెంట్‌గా సాగుతోన్న సమయంలో విజయ్‌ తండ్రి, నిర్మాత, నటుడు అళగప్పన్‌  అమలాపాల్‌‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. విజయ్-అమలాపాల్ విడిపోవడానికి హీరో ధనుషే కారణం అంటూ బాంబు పేల్చారు. ‘అమ్మ కణక్కు’ మూవీలో నటించినమని ధనుష్, అమలాను కోరాడని, ఆమె అందుకు ఒప్పుకోవడం కూడా వెంటనే జరిగిపోవడంతో విజయ్ హర్టయ్యాడని అళగప్పన్‌ చెప్పారు. అంతకుముందు పెళ్లి తర్వాత సినిమాల్లో నటించనని చెప్పిన అమలాపాల్ .. మాట మీద నిలబడకపోవడమే మనస్పర్థలకు కారణమన్నారు ఆయన. ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో విపరీతంగా సర్కులేట్ అయ్యాయి.

తన మాజీ మామకు లేటుగా, కాస్త ఘాటుగా రిప్లై ఇచ్చింది అమలాపాల్. విడాకులు తీసుకోవడం తన సొంత అభిప్రాయం అని, అందుకు ఎవరూ కారణం కాదని తేల్చి చెప్పింది. అసలు ఒకరి కారణంగా వివాహాన్ని ఎవరైనా రద్దు చేసకుంటారాఅని ప్రశ్నించింది. ధనుష్ ఎప్పుడూ తన మంచి కోరుకునే వ్యక్తని, అతడిపై అనవసర అభియోగాల మోపొద్దని కోరింది. ఎప్పుడో జరిగిపోయిన విషయాలు పదే, పదే ప్రస్తావించవద్దని..కొన్ని పర్సనల్ విషయాలకు పరిధులు ఉంటాయని పేర్కుంది. కాగా ప్రస్తుతం ఈ నటి లీడ్ రోల్‌లో నటించిన  ‘అదో అందపరవై పోల’ త్వరలో రిలీజ్‌కు సిద్దమైంది. మరోవైపు  మహేశ్‌భట్‌ తెరకెక్కించనున్న  ‘పర్వీన్‌ బాబీ’ బయోపిక్‌తో అమలాపాల్‌ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.