Tollywood : రేర్ కాంబో..డార్లింగ్‌తో నాగ్ అశ్విన్..!
Tollywood : ‘మహానటి’..తెలుగులో వచ్చిన ఈ మూవీ భారత చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని చెక్కిన తీరుకు తెలుగు జాతి యావత్తు సాహో అంది. మహానటి సావిత్రి జీవితంలోని అన్ని కోణాలను ఈ చిత్రంతో ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మూవీకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. అయితే ఆ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా..నాగ్ అశ్విన్ మరో మూవీని ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు […]
Tollywood : ‘మహానటి’..తెలుగులో వచ్చిన ఈ మూవీ భారత చలనచిత్ర పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్రాన్ని చెక్కిన తీరుకు తెలుగు జాతి యావత్తు సాహో అంది. మహానటి సావిత్రి జీవితంలోని అన్ని కోణాలను ఈ చిత్రంతో ఆవిష్కరించాడు డైరెక్టర్. ఈ మూవీకి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ గౌరవాలు లభించాయి. అయితే ఆ సినిమా విడుదలై రెండేళ్లు దాటినా..నాగ్ అశ్విన్ మరో మూవీని ప్రకటించలేదు. మెగాస్టార్ చిరంజీవి, న్యాచురల్ స్టార్ నానిలతో చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చినా..అవన్నీ అధికారిక ప్రకటనల వరకు వెళ్లలేదు. అయితే ఇండస్టీ వర్గాల తాజా సమాచారం ప్రకారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ సినిమా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది.
ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గ రేంజ్‌లో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నారట నాగ్ అశ్విన్. ఇప్పుడు అందుకు తగ్గ భారీ కథను కూడా డిజైన్ చేసి పెట్టుకున్నాడట. ప్రస్తుతం ప్రభాస్..’జిల్’ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో మూవీ చేస్తున్నారు. ఇది పూర్తి కావడానికి ఇంచుమించు మరో 6 నెలలు సమయం పట్టేలా ఉంది. కాగా ప్రభాస్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో డార్లింగ్‌కి అశ్విన్ కథ నచ్చితే మాత్రం ఓ క్రేజీ కాంబో సిద్దమైపోయినట్లే. లెట్స్ వెయిట్ అండ్ సి.
ఇది కూాడా చదవండి : ‘అమ్మ బయోపిక్’…శోభన్‌బాబు దొరికేశాడు..!