AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Nambeesan:దర్శకురాలిగా మారిన నటి.. అందరినీ ఏకిపారేసిందిగా..!

రమ్యా నంబీషన్.. ఈ పేరు చెప్పగానే టాలీవుడ్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేయకపోవచ్చు. కానీ పిజ్జా సినిమా చూసిన వారు ఈ అమ్మడును కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ భామ ఇక్కడ పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం రమ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే రమ్య నంబీషన్ ఎన్‌కోర్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రారంభించిన ఈ హీరోయిన్.. తాజాగా మరో అవతారమెత్తింది. దర్శకురాలిగా […]

Ramya Nambeesan:దర్శకురాలిగా మారిన నటి.. అందరినీ ఏకిపారేసిందిగా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Feb 18, 2020 | 1:43 PM

Share

రమ్యా నంబీషన్.. ఈ పేరు చెప్పగానే టాలీవుడ్ ప్రేక్షకులు ఇట్టే గుర్తుపట్టేయకపోవచ్చు. కానీ పిజ్జా సినిమా చూసిన వారు ఈ అమ్మడును కచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. తెలుగులో రెండు, మూడు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ భామ ఇక్కడ పెద్దగా క్లిక్ కాలేకపోయింది. అయితే తమిళం, మలయాళంలో మాత్రం రమ్యకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే ఇటీవలే రమ్య నంబీషన్ ఎన్‌కోర్ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రారంభించిన ఈ హీరోయిన్.. తాజాగా మరో అవతారమెత్తింది. దర్శకురాలిగా తన ప్రతిభను బయటపెట్టింది రమ్య.

‘అన్‌ హైడ్’ పేరుతో రమ్య తీసిన షార్ట్ ఫిలిం తాజాగా విడుదలైంది. మూడు నిమిషాల పాటు సాగిన ఈ షార్ట్ ఫిలింలో సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపించడంతో పాటు.. పురుషులు ఎలా ఉండాలో కూడా వివరించింది. ఇక ఈ లఘు చిత్రానికి భద్రీ వెంకటేష్ డైలాగ్‌లు రాయగా.. రమ్య సోదరుడు రాహుల్ సుబ్రమణ్యం సంగీతం అందించారు. ఈ షార్ట్‌ ఫిలింలో రమ్య, శ్రిత శివదాస్ నటించారు. ప్రస్తుతం ఈ లఘు చిత్రంలో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తుండగా.. సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అర్థవంతంగా, అద్భుతంగా.. రమ్య ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించిందని నెటిజన్లు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి అన్ హైడ్‌తో తనలో ఇన్నిరోజులు హైడ్ అయి ఉన్న టాలెంట్‌ను బయటపెట్టేసింది రమ్య. ఇక ఈ లఘు చిత్రం ఇచ్చిన ఊపుతో రమ్య భవిష్యత్‌లో ఓ చిత్రాన్ని తెరకెక్కించినా ఆశ్చర్యపోవక్కర్లేదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..