‘నిశ్శబ్దం’… ‘301’ దేనికి సంకేతం..?

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైలెన్స్’. దీనిని తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన వెంకట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. వివిధ రంగులు పులుముకున్న రెండు చేతులు 301 అనే సంఖ్యను సింబాలిక్‌ గా చూపిస్తుంటే, మరోవైపు ఒక చేతికి ఒక తాళం ఉన్న బ్రేస్ లెట్ ఉంది. బ్యాగ్రౌండ్‌లో పాడుబడిన పెద్ద ద్వారంతో ఉన్న […]

  • Ravi Kiran
  • Publish Date - 6:37 pm, Sat, 20 July 19
'నిశ్శబ్దం'... '301' దేనికి సంకేతం..?

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైలెన్స్’. దీనిని తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన వెంకట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.

వివిధ రంగులు పులుముకున్న రెండు చేతులు 301 అనే సంఖ్యను సింబాలిక్‌ గా చూపిస్తుంటే, మరోవైపు ఒక చేతికి ఒక తాళం ఉన్న బ్రేస్ లెట్ ఉంది. బ్యాగ్రౌండ్‌లో పాడుబడిన పెద్ద ద్వారంతో ఉన్న ఈ లుక్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అంతేకాకుండా ఆ లుక్ మొత్తం ఓ పజిల్ మాదిరిగా ఉండడం విశేషం. మాధవన్, అంజలి,షాలిని పాండేలు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.