AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka sharma: అనుష్క శర్మకు కొత్త కష్టాలు.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు..

విరాట్‌ కోహ్లీ సతీమణికి కొత్త కష్టాలొచ్చాయి. సేల్ టాక్స్‌ ఎగ్గొట్టినందుకు బాంబే హైకోర్టు మొట్టికాయలేసింది. అవును, అనుష్క శర్మకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర సేల్‌ టాక్స్‌ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన

Anushka sharma: అనుష్క శర్మకు కొత్త కష్టాలు.. ఆ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు..
Anushka Sharma
Shiva Prajapati
|

Updated on: Mar 31, 2023 | 6:22 AM

Share

విరాట్‌ కోహ్లీ సతీమణికి కొత్త కష్టాలొచ్చాయి. సేల్ టాక్స్‌ ఎగ్గొట్టినందుకు బాంబే హైకోర్టు మొట్టికాయలేసింది. అవును, అనుష్క శర్మకు బాంబే హైకోర్టులో చుక్కెదురైంది. మహారాష్ట్ర సేల్‌ టాక్స్‌ శాఖ అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. 2012-16 మధ్య ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయి పడిన అమ్మకపు పన్ను చెల్లించాలంటూ సేల్స్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ పంపిన నోటీసులను సవాల్‌ చేస్తూ అనుష్క శర్మ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. నిర్మాతలు, ఈవెంట్‌ ఆర్గనైజర్లతో చేసుకున్న ఒప్పందం మేరకు అవార్డు కార్యక్రమాలు, స్టేజ్‌ షోలలో ప్రదర్శనలను ఇస్తానని తెలిపారు.

వివిధ కార్యక్రమాల్లో నటించినంత మాత్రాన ఆ వీడియోల కాపీరైట్స్‌ తనకు రావని, కాపీరైట్స్‌ అన్నీ నిర్మాతకే ఉంటాయని తన పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. అయితే ఇది తప్పని.. తాను స్టేజ్‌షోలు చేస్తే ఆ వీడియోలపై అనుష్కకే హక్కు ఉండేలా ఒప్పందం ఉందని. అంతేగాక నిర్మాతల నుంచి కొంత మొత్తం తీసుకుని తన కాపీరైట్స్‌ను వారికి బదిలీ చేశారని పేర్కొంది. దీంతో సేల్స్‌ ట్యాక్స్‌ కట్టాల్సిందే అనడంతో బాంబే హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. నాలుగు వారాల్లోగా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ సేల్స్‌ ట్యాక్స్‌ ముందు అప్పీల్‌ చేసుకోవాలని సూచించింది. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలన్నింటిపై అప్పీలేట్‌ అథారిటీ సమగ్ర దర్యాప్తు జరిపి పరిష్కరిస్తుంది.

ఈ పిటిషన్లను ఇప్పుడు తాము విచారిస్తే.. ఎంవీఏటీ చట్టం కింద ఉన్న అన్ని సమస్యలు ఇక్కడికే వస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. చాలా అవార్డు ఫంక్షన్లలో అనుష్క డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌ చేశారు. స్టేజ్‌ షో చేసినందుకు రెమ్యునరేషన్‌తోపాటు.. ఆ వీడియోలపైనా తనకే హక్కుఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ వీడియోలను ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకునే హక్కు అనుష్కకు ఉంది. దీంతో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని చెప్పి సేల్స్‌ ట్యాక్స్‌ శాఖ కోర్టుకెక్కింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
మళ్లీ అందరి మనసులు గెల్చుకున్న బిగ్‌బాస్ తనూజ.. వీడియో వైరల్
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
హైదరాబాద్ వాసులకు మరోసారి ఈగల్ టీమ్ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
శ్రీశైలంలో ఆన్ లైన్ విధానానికి భక్తులలో అనూహ్య స్పందన
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ అవుట్? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
ఆమ్లెట్ Vs ఉడికించిన గుడ్డు.. బరువు తగ్గడానికి ఏది మంచిది?
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
కొత్త సంవత్సరం గిఫ్ట్.. ఏపీలోని రైతులకు ప్రభుత్వం నుంచి శుభవార్త.
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
KCR దగ్గరకు వెళ్లి పలకరించిన CM రేవంత్ రెడ్డి
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
శత్రువుల గుండెల్లో వణుకు.. ఆర్మీ చేతికి అత్యాధునిక అస్త్రాలు..
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్
ధోనీ కారులో సిగరెట్ ప్యాకెట్.. వైరల్ వీడియోతో సోషల్ మీడియా షేక్