Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఎంట్రీ ఆ సినిమాతోనేనా..? ఊహించని ఎలిమెంట్స్‌తో

నిన్నగాక మొన్నొచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియన్ సినిమాలు చేస్తుంటే.. పవన్ మాత్రం ఇప్పటికీ తెలుగులోనే ఉండిపోయారు. ఈయన పారితోషికం పాన్ ఇండియా చేరింది కానీ సినిమా అయితే చేరలేదు. అందుకే సాలిడ్ సబ్జెక్ట్‌తో పాన్ ఇండియన్ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు పవర్ స్టార్. మరి ఆయన చేస్తున్న సినిమాల్లో ఆ సాలిడ్ సబ్జెక్ట్ ఏంటి..? దేంతో పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నారు..?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా ఎంట్రీ ఆ సినిమాతోనేనా..? ఊహించని ఎలిమెంట్స్‌తో
Pawan Kalyan
Follow us

|

Updated on: Mar 30, 2023 | 9:47 PM

పాన్ ఇండియా.. ప్రస్తుతం మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇది. నాని, రిషబ్ శెట్టి లాంటి హీరోలు ఈ పదాన్ని ఇష్టపడట్లేదు.. ఇండియన్ సినిమా అంటున్నారు వాళ్లు. కానీ వాళ్లెంత కాదన్నా పాన్ ఇండియన్ సినిమాల హవా ప్రస్తుతం బాగానే కనిపిస్తుంది. ఈ లిస్టులోకి పవన్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. OG సినిమాతోనే ఈ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు పవర్ స్టార్.

కుర్ర హీరోలు కూడా పాన్ ఇండియా అంటూ అన్ని ఇండస్ట్రీలపై దండెత్తుతుంటే.. తను మాత్రం ఇక్కడెందుకు ఉండాలి అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అందుకే ఇన్నాళ్లూ పర్ఫెక్ట్ కథ కోసం చూసిన పవన్‌కు ఓజి మంచి కిక్ ఇచ్చింది. ఏడేళ్ల కింద సర్దార్ గబ్బర్ సింగ్ హిందీలో విడుదలైనా అది డబ్బింగే.. హరిహర వీరమల్లు కూడా అనువాదమే కానీ పాన్ ఇండియా కాదు.

సుజీత్ చెప్పిన ఓజి కథ పాన్ ఇండియన్ అప్పీల్ ఉండటంతో అటు వైపు అడుగులేస్తున్నారు పవన్. ఆయన లేని సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు సుజీత్. మే నుంచి OGకి డేట్స్ ఇచ్చారు పవన్. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో పవన్ డాన్‌గా నటించబోతున్నారు. మొత్తానికి కాస్త లేటైనా.. పవన్ కూడా పాన్ ఇండియన్ క్లబ్‌లోకి అడుగు పెడుతున్నారన్నమాట.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో