AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ..!

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఆ స్టార్ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 08, 2020 | 10:38 AM

Share

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ దర్శకుడి సినిమా ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ.. ఈ దర్శకుడి డైరక్షన్‌లో బాలయ్య వారసుడు.. ఇలా పలు రకాల వార్తలు వినిపించాయి. అయితే వాటిలో ఏవీ ఇంతవరకు నిజం కాలేదు.  దానికి తోడు పలుసార్లు మీడియా కంటికి చిక్కిన మోక్షజ్ఞ లావుగా కనిపించడంతో అసలు ఈ నందమూరి వారసుడు సినిమాల్లోకి వస్తాడా..? రాడా..? అన్న ప్రశ్న అభిమానుల్లో తొలుస్తూనే ఉంది( ఇదిలా ఉంటే సినిమాల్లోకి వచ్చేందుకు మోక్షజ్ఞ ఆసక్తిని చూపడం లేదని, అందుకోసం బాలయ్య ఓ యఙ్ఞం కూడా చేయించారన్న టాక్ కూడా నడిచింది అది వేరే విషయం). ఇలాంటి నేపథ్యంలో తాజాగా మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య స్పందించారు.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన బాలకృష్ణ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకోగా.. అందులో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు. ఏ సమయంలోనైనా మోక్షజ్ఞ సినిమాల్లోకి రావొచ్చంటూ ఆయన చెప్పుకొచ్చారు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ వార్తలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడి పేరు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరంటే అనిల్ రావిపూడి. వరుసగా ఐదు విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న ఈ దర్శకుడి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బాలయ్య నుంచి అనిల్‌కి పిలుపు వచ్చినట్లు టాక్‌. మరోవైపు ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, బాలయ్య వారసుడి కోసం కథను రెడీ చేస్తున్నట్లు సమాచారం. మరి వీటిలో నిజమెంత..? బాలయ్య వారసుడి ఎంట్రీ ఎప్పుడు..? ఎవరి దర్శకత్వం ద్వారా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: మీ ఫోన్ హ్యాక్ అయ్యిందా.. తెలుసుకోండిలా..!

Follow Us
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
16 ఏళ్ల తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
నేడు తిరుమల ఆలయం బంద్.. దర్శనాలు తిరిగి అప్పుడే..
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే రికార్డు
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. కట్‌చేస్తే
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
రైతులకు ఇది కదా కావాల్సింది.. అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన..
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
నేడే చంద్ర గ్రహణం.. ఆ ఒక్క రాశి వారికి ప్రమాదాలు, గండాలు తప్పవు
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
వేప ఆకుల మహిమ..ఖాళీ కడుపుతో నాలుగు రెమ్మలు నమలితే శరీరంలో జరిగేది
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
మైక్రో అపెక్స్ వన్ ట్రెండ్‌లో భద్రతా లోపాలు!
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
సామాన్యులపై పిడుగు.. యుద్ద ప్రభావంతో త్వరలో పెరగనున్న వీటి ధరలు
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ తమిళ థ్రిల్లర్ మూవీ..