బాలయ్య బాబా మాజాకా..! అప్పట్లో ఊపేసిన ఈ సాంగ్ విన్నారా..? ఇప్పటికీ అదే క్రేజ్
సినిమాల విజయంలో సంగీతం కూడా కీలక పాత్రలు పోషిస్తుంది. చాలా సినిమాలు మ్యూజిక్ వల్ల హిట్ అయ్యాయి. చాలా సినిమాలను మ్యూజిక్ లేపుతుంది. సినిమాలో కథ మామూలుగానే ఉన్నా మ్యూజిక్ కారణంగా హిట్ అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక సినిమాలు ఫ్లాప్ అయినా మ్యూజికల్ గా హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. కొంన్సర్లు సినిమాలతో పోటీగా సాంగ్స్ కూడా హిట్ అవుతుంటాయి.

సినిమాలు ఎంత సక్సెస్ అవుతుంటాయో.. సినిమాల్లోని సాంగ్స్ కూడా అదే రేంజ్ లో హిట్ అవుతున్నాయి. కొన్నిసార్లు సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ మారం సూపర్ హిట్ అవుతుంటాయి. మరికొన్ని సార్లు సినిమా హిట్ అవ్వడానికి మ్యూజిక్ పెద్ద కారణం అవుతుంటాయి. కొన్ని సార్లు సినిమాలతో పోటీగా సాంగ్స్ కూడా హిట్ అవుతుంటాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకున్న సినిమాకు సంబందించిన సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ సినిమా విడుదలై చాలా కాలమే అవుతుంది. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సాంగ్ క్రేజ్ ఎక్కడ తగ్గదు. సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కాగా ఓ సాంగ్ మాత్రం ఇప్పటికీ యూట్యూబ్ లో సెన్సేషన్ గా రికార్డ్ క్రియేట్ చేసింది.. ఇంతకూ ఆ సినిమా ఏంటి.? ఆ సాంగ్ ఎదో ఒకేసారి చూద్దాం.!
పైన మనం మాట్లాడుకున్న సినిమా 1999 లో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అంతే కాదు ఈ సినిమా భారీ మల్టీస్టారర్ మూవీ.. సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోలు నటించారు. ఆ సినిమా ఎదో కాదు ముగ్గురు కృష్ణలు కలిసి నటించిన సుల్తాన్. నందమూరి బాలకృష్ణ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశారు. అలాగే ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు కూడా కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రం 1999 మే 27 న విడుదలైంది. ఈ సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముగ్గురు హీరోల అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. తీరా సినిమా విడుదల తర్వాత విమర్శకుల నుంచి మిశ్రమ రివ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. అలాగే ఈ సినిమాలో రచన, రోజా, దీప్తీ భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకు కోటి సంగీతం అందించారు. ఈ మూవీలో పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. అప్పట్లో ఒక ఊపు ఊపేశాయి. ముఖ్యంగా బాలయ్య, రోజా కలిసి చేసిన “ఓ కలికి రామచిలకా” సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. వేటూరి సుందరరామమూర్తి ఈ పాటను రచించారు. ఉదిత్ నారాయణ్, చిత్ర ఆలపించారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సాంగ్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది. చాలా మంది ప్లే లిస్ట్ లో ఈ సాంగ్ ఉంటుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
