అతను జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడం తట్టుకోలేకపోయా..! స్టేజ్ మీదే ఎమోషనల్ అయ్యా.!! : ఇంద్రజ
ఒకప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ స్టేటస్‌ను సొంతం చేసుకుంది ఇంద్రజ( Indraja). అందం, అభినయం పరంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగులో టాప్ హీరోలందరి సరసన నటించిమెప్పించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది

నటి ఇంద్రజ మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్, అలాగే జబర్దస్త్ షో గురించి కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. యాంకర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ నుంచి సుధీర్, చంద్ర, అభి వంటి వారు వెళ్లిపోయిన తర్వాత కార్యక్రమ రేటింగ్స్ తగ్గాయా అని అడిగినప్పుడు, ఇంద్రజ స్పందిస్తూ.. “మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి నేను చెప్తాను. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడనండి. మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ ప్రొఫెషనల్, పర్సనల్ దేని గురించి నేను మాట్లాడనండి” అని ఆమె బల్లగుద్ది చెప్పారు. దీనివల్లే చాలా మంది తమ వ్యక్తిగత విషయాలను తనతో పంచుకుంటారని, తాను వాటిని రహస్యంగా ఉంచుతానని ఇంద్రజ వివరించారు. అయితే, సుధీర్ లేని లోటు గురించి అడగ్గానే ఇంద్రజ భావోద్వేగానికి లోనయ్యారు. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుధీర్ లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ ఒంటరివాడైపోయాడని కెవ్వు కార్తీక్ చేసిన స్కిట్ గురించి ప్రస్తావించారు. ఆ స్కిట్ చూసినప్పుడు తాను కన్నీళ్లను ఆపుకోలేకపోయానని, పబ్లిక్‌లో అంతగాఎమోషనల్ అవ్వని తను అప్పుడు మాత్రం తట్టుకోలేకపోయానని తెలిపారు.
సుధీర్‌ను తాను సిద్ధు అని పిలుస్తానని వెల్లడించారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధానికి, ఆప్యాయతకు నిదర్శనం. సుధీర్ అక్క ఒక ఎపిసోడ్‌కు వచ్చినప్పుడు ఇంట్లో తమను “సిద్ధు” అని పిలుస్తారని చెప్పడంతో ఈ పేరు అలవాటైందని ఇంద్రజ పేర్కొన్నారు. సుధీర్ కూడా కొన్నిసార్లు తనను ఇంట్లో పిలిచే పేరు “రాజీ” అని పిలుస్తుంటాడని చెప్పారు. ఈ బంధం కెమెరా కోసం కాదని, హృదయం నుంచి వచ్చినదని ఆమె అన్నారు. ఇంద్రజ, సుధీర్ మధ్య సుమారు 7-8 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ, ప్రేక్షకులు వారిని “అమ్మ కొడుకు” లాగా చూస్తారని, ఇది చాలా బాగుంటుందని తెలిపారు. ఎవరైనా తనను “అమ్మా” అని పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుందని ఇంద్రజ అన్నారు.
సుధీర్‌తో పాటు, ప్రవీణ్‌తో కూడా తనకు తల్లి-కొడుకు బంధం ఉందని ఇంద్రజ పంచుకున్నారు. ప్రవీణ్‌ను “దేవుడిచ్చిన కొడుకు” అని, నేను “దేవుడిచ్చిన అమ్మ” అని ఆమె అభివర్ణించారు. “అమ్మ లేదు కదా” అనే లోటును ప్రవీణ్ ఎక్కువగా ఫీల్ అవుతాడని తెలిసి బాధపడుతానని, ఎప్పుడూ తనను సంప్రదించవచ్చని చెప్పానని అన్నారు. మదర్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ప్రవీణ్‌తో కలిసి చేసిన స్కిట్ గురించి కూడా ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రవీణ్‌కు తాను ఒక వాచ్, కారు సౌండ్ సిస్టమ్ కోసం డబ్బు వంటి బహుమతులు ఇచ్చానని వెల్లడించారు. చివరిగా, సుధీర్ పెళ్లి గురించి అడిగినప్పుడు కూడా ఇంద్రజ “అది ఆయన పర్సనల్.. రేపు నా కూతురికి నేను అదే చెప్తున్నాను. నీ పెళ్ళికి నాకు చెప్పి పిలవమ్మా అని చెప్తున్నాను” అని ఆమె సరదాగా చెప్పారు. ఒకవేళ వారే వచ్చి “అమ్మ చూసి పెట్టు” అంటే తప్ప, మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదని అభిప్రాయపడ్డారు.
View this post on Instagram
