AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామాయణంలో మరో సర్‌ప్రైజ్..! కీలక పాత్రలో కనిపించిన టాలీవుడ్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా.?

బాక్సాఫీస్ వద్ద అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘రామాయణం పార్ట్ 1’. తాజాగా నవంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ నితీశ్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

రామాయణంలో మరో సర్‌ప్రైజ్..! కీలక పాత్రలో కనిపించిన టాలీవుడ్ విలన్.. ఎవరో గుర్తుపట్టారా.?
Ramayana
Rajeev Rayala
|

Updated on: Nov 06, 2026 | 8:23 AM

Share

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రస్తుతం ఎక్కడ చూసినా రామాయణ సినిమా గురించే చర్చ జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాలోని స్టార్ కాస్టింగ్, పాత్రల చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా చివర్లో ఇచ్చిన ఓ సర్‌ప్రైజ్ తెలుగు ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణ సినిమాపై మొదటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్‌తో ఈ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ప్రమోషనల్ కంటెంట్ ఆయన పాత్రపై అంచనాలను పెంచాయి.

సీతమ్మ పాత్రలో సాయిపల్లవి కనిపిస్తుండగా, రావణాసురుడిగా కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్నారు. వీరిద్దరి పాత్రలపై కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లలో ఆయన లుక్‌ను పూర్తిగా రివీల్ చేయకపోవడంతో హనుమంతుడిగా సన్నీ ఎలా కనిపించబోతున్నారనే ఆసక్తి మరింత పెరిగింది. మొదటి భాగం చివర్లో హనుమంతుడి పాత్రను పరిచయం చేస్తూ హనుమాన్ చాలీసాను వినిపించడం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది. రెండో భాగంపై ఆసక్తి పెంచేలా ఈ సన్నివేశాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. హనుమంతుడిగా సన్నీ డియోల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన పూర్తి రూపాన్ని చూపించకపోవడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. రెండో భాగంలో ఆయన పాత్రకు మరింత ప్రాధాన్యం ఉండనుందని ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక సినిమా ఎండ్ టైటిల్స్‌లో రావణాసురుడి కుమారుడు ఇంద్రజిత్ అలియాస్ మేఘనాథుడి పాత్రను పరిచయం చేయడం మరో ఆసక్తికరమైన అంశం. ఈ పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కనిపించడం తెలుగు ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌గా మారింది. నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాతో రాఘవ్ జుయల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో ఆయన విక్రమ్ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాఘవ్ జుయల్ వేసిన డ్యాన్స్ స్టెప్పులు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు సినిమాలో ఆయన పోషిస్తున్న విలన్ పాత్రపై కూడా మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఏకంగా రామాయణలో మేఘనాథుడిగా కనిపించడం విశేషంగా మారింది. రామాయణంలో మేఘనాథుడు అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకరు. అందుకే రెండో భాగంలో రాఘవ్ జుయల్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉందని సినీ అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ది ప్యారడైజ్ తో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంటున్న రాఘవ్ జుయల్.. ‘రామాయణ’తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రామాయణంలో మరో సర్‌ప్రైజ్..! కీలక పాత్రలో కనిపించిన టాలీవుడ్ విలన్
రామాయణంలో మరో సర్‌ప్రైజ్..! కీలక పాత్రలో కనిపించిన టాలీవుడ్ విలన్
సురేష్ గురు కంటికి సమస్య ఏంటంటే..?
సురేష్ గురు కంటికి సమస్య ఏంటంటే..?
టీమిండియాతో సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు భారీ షాక్
టీమిండియాతో సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు భారీ షాక్
అల్లం వంకాయ కూర.. తింటే, ఎంత మొండి జలుబు అయినా పారిపోవాల్సిందే
అల్లం వంకాయ కూర.. తింటే, ఎంత మొండి జలుబు అయినా పారిపోవాల్సిందే
రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్..
రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్..
అతను అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆయన డాన్స్ స్పీడ్ చూస్తే మతిపోతుంది
అతను అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆయన డాన్స్ స్పీడ్ చూస్తే మతిపోతుంది
రెండు గంటల్లో రూ. 24 వేల బిజినెస్.. ఐడియా మామూలుగా లేదుగా!
రెండు గంటల్లో రూ. 24 వేల బిజినెస్.. ఐడియా మామూలుగా లేదుగా!
APPSC గ్రూప్‌ 1 అభ్యర్థులకు అలర్ట్‌.. మరికొద్ది రోజులే ఛాన్స్‌!
APPSC గ్రూప్‌ 1 అభ్యర్థులకు అలర్ట్‌.. మరికొద్ది రోజులే ఛాన్స్‌!
అండాల సేకరణ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో విచారణ
అండాల సేకరణ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో విచారణ
విదేశాల నుంచి ఎంతవరకు బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు..?
విదేశాల నుంచి ఎంతవరకు బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు..?