AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs NZ: టీమిండియాతో సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ సిరీస్‌కు దూరం

IND Vs NZ: భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే కన్కషన్ కారణంగా మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో నిక్ కెల్లీని జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే రాచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ కూడా దూరమయ్యారు. రెండో వన్డే నవంబర్ 7న వెలింగ్టన్‌లో జరగనుంది.

IND Vs NZ: టీమిండియాతో సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు భారీ షాక్.. స్టార్ ఓపెనర్ సిరీస్‌కు దూరం
Devon Conway
Rakesh
|

Updated on: Nov 06, 2026 | 8:21 AM

Share

IND Vs NZ: భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా మిగిలిన వన్డేలకు దూరమయ్యాడు. ఇప్పటికే తొలి వన్డేకు దూరమైన అతడు.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నవంబర్ 7న రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం కివీస్ జట్టుకు ఇబ్బందిగా మారింది. కాన్వే స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నిక్ కెల్లీని జట్టులోకి తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ ప్రకటించింది.

కన్కషన్ కారణంగా సిరీస్‌కు దూరమైన కాన్వే

గత వారం ప్రాక్టీస్ సమయంలో సహచర ఆటగాడు మాట్ హెన్రీతో ఢీకొనడంతో డెవాన్ కాన్వేకు తలకు గాయమైంది. ఈ ఘటన కారణంగా అతడికి కన్కషన్ సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 4న ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో కూడా ఆడలేకపోయాడు. తాజాగా వైద్య పరీక్షలు, కోలుకునే సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలిన వన్డేల్లో ఆడించకూడదని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. 35 ఏళ్ల కాన్వే ఇప్పుడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టనున్నాడు.

కాన్వే స్థానంలో నిక్ కెల్లీకి అవకాశం

డెవాన్ కాన్వే స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ నిక్ కెల్లీని న్యూజిలాండ్ జట్టులోకి ఎంపిక చేశారు. రెండో వన్డేకు ముందు శుక్రవారం వెలింగ్టన్‌లో జట్టుతో అతడు కలవనున్నాడు. కాన్వే ఓపెనింగ్ స్థానంలో కీలక ఆటగాడు కావడంతో అతడి గైర్హాజరీ కివీస్ బ్యాటింగ్ కూర్పుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు మాట్ హెన్రీ కన్కషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడు. ఇది న్యూజిలాండ్‌కు కొంత ఊరటనిచ్చే అంశం.

టెస్టు సిరీస్‌పై కాన్వే ఆశలు

వన్డే సిరీస్‌కు దూరమైన కాన్వే ఇప్పుడు టెస్టు సిరీస్‌లో తిరిగి బరిలోకి దిగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. నవంబర్ 19 నుంచి వెలింగ్టన్‌లో భారత్‌తో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ఆ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. కన్కషన్ సమస్య నుంచి కోలుకోవడానికి వైద్యుల సూచనల ప్రకారం విశ్రాంతి తీసుకోనున్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్‌కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.

ఇప్పటికే రాచిన్, చాప్‌మన్ కూడా దూరం

భారత్‌తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే న్యూజిలాండ్‌కు మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఆల్‌రౌండర్ రాచిన్ రవీంద్ర, మార్క్ చాప్‌మన్ జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. ఇప్పుడు కాన్వే కూడా తప్పుకోవడంతో కివీస్ జట్టు కూర్పుపై ప్రభావం పడుతోంది. అయితే మిగిలిన మ్యాచ్‌ల కోసం జట్టులో మార్పులు చేస్తూ అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో బరిలోకి దిగేందుకు న్యూజిలాండ్ సిద్ధమవుతోంది.

భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే

భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ నవంబర్ 4న ఆక్లాండ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే నవంబర్ 7న వెలింగ్టన్‌లో జరగనుంది. మూడో మ్యాచ్ నవంబర్ 10న హామిల్టన్‌లో, నాలుగో మ్యాచ్ నవంబర్ 13న మౌంట్ మాంగనుయ్‌లో నిర్వహించనున్నారు. ఐదో వన్డే కూడా నవంబర్ 15న అదే వేదికపై జరగనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌లో ఆధిక్యంలో ఉండగా, రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను సమం చేయాలని న్యూజిలాండ్ భావిస్తోంది.

న్యూజిలాండ్ అప్‌డేటెడ్ జట్టు

మొదటి మూడు వన్డేలకు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సీఫర్ట్, నాథన్ స్మిత్, విల్ యంగ్, బ్లెయిర్ టిక్నర్.

నాలుగు, ఐదు వన్డేలకు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, లాకీ ఫెర్గూసన్, మిచ్ హే, నిక్ కెల్లీ, టిమ్ సీఫర్ట్, బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీమిండియాతో సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు భారీ షాక్
టీమిండియాతో సిరీస్ మధ్యలో న్యూజిలాండ్‌కు భారీ షాక్
అల్లం వంకాయ కూర.. తింటే, ఎంత మొండి జలుబు అయినా పారిపోవాల్సిందే
అల్లం వంకాయ కూర.. తింటే, ఎంత మొండి జలుబు అయినా పారిపోవాల్సిందే
రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్..
రైల్వే టికెట్ల ధరలు తగ్గింపు.. ప్రయాణికులకు గుడ్ న్యూస్..
అతను అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆయన డాన్స్ స్పీడ్ చూస్తే మతిపోతుంది
అతను అద్భుతమైన డ్యాన్సర్ అని, ఆయన డాన్స్ స్పీడ్ చూస్తే మతిపోతుంది
రెండు గంటల్లో రూ. 24 వేల బిజినెస్.. ఐడియా మామూలుగా లేదుగా!
రెండు గంటల్లో రూ. 24 వేల బిజినెస్.. ఐడియా మామూలుగా లేదుగా!
APPSC గ్రూప్‌ 1 అభ్యర్థులకు అలర్ట్‌.. మరికొద్ది రోజులే ఛాన్స్‌!
APPSC గ్రూప్‌ 1 అభ్యర్థులకు అలర్ట్‌.. మరికొద్ది రోజులే ఛాన్స్‌!
అండాల సేకరణ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో విచారణ
అండాల సేకరణ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉందన్న కోణంలో విచారణ
విదేశాల నుంచి ఎంతవరకు బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు..?
విదేశాల నుంచి ఎంతవరకు బంగారాన్ని ఇండియాకు తెచ్చుకోవచ్చు..?
ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తాగండి.. కేవలం 30 నిమిషాల్లోనే
ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ తాగండి.. కేవలం 30 నిమిషాల్లోనే
RRB రైల్వేలో 191 ఉద్యోగాలు.. నెలకు రూ.44,900 జీతం!
RRB రైల్వేలో 191 ఉద్యోగాలు.. నెలకు రూ.44,900 జీతం!