‘మన శంకరవరప్రసాద్ గారు’.. ఈ ఎమోషనల్ సాంగ్ పాడింది చిరంజీవి మేనకోడలే.. వీడియో ఇదిగో
చిరంజీవి నటించిన 'మన శంకరవరప్రసాద్' గారు సినిమాలో చిన్నపిల్లల వాయిస్ తో కూడిన ఓ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. 'ఫ్లై.. హై' అంటూ సాగే పాట ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రికార్డు కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తద్వారా రీజినల్ సినిమా కేటగిరీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా మెగాస్టార్ సినిమా రికార్డు సొంతం చేసుకుంది. మన శంకరవరప్రసాద్ గారు జోరు చూస్తుంటే ఈ వీకెండ్ నాటికి రూ. 400 కోట్లను దాటవచ్చని ట్రేడ్ నిపుణలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. మీసాల పిల్ల, శశిరేఖ, హుక్ స్టెప్ సాంగ్స్ యూట్యూబ్ లో ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో మరో సాంగ్ కూడా ఉంది. చిరంజీవి తన పిల్లలను కలుసుకున్న సందర్భంలో వచ్చే ఈ ‘ఫ్లై.. హై’ సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ సాంగ్ గురించి ఇప్పుడు ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటంటే..
‘మన శంకరవరప్రసాద్’ లోని ఈ పాట పాడింది స్వయానా మెగాస్టార్ మేనకోడలేనట. చిరంజీవి సోదరి మాధవి కుమార్తె నైరా నే ఈ పాట ఆలపించిందని డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఇది కేవలం నైరాకు ప్రారంభం మాత్రమేనని.. తనకు సుదీర్ఘమైన కెరీర్ ఉందని అనిల్ రావిపూడి ఆకాంక్షించారు. ఇక ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను బుధవారం (జనవరి 21) ఉదయం 11.07 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ ‘ఫ్లై.. హై’ సాంగ్ సినిమాకు ఎమోషనల్ ఫీలింగ్‌ను తీసుకొచ్చిందని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. కాగా ఈ మెగా మూవీకి భీమ్స్ స్వరాలు సమకూర్చారు.
చిరంజీవి మేనకోడలు ఎంత బాగా పాడుతుందో చూశారా? వీడియో
A melody that celebrates the most selfless love of all ❤️#FlyingHigh Full Video Song from #ManaShankaraVaraPrasadGaru out tomorrow at 11:07 AM ❤️🔥
Sung by #Naira Lyrics by #KittuVissapragada Music by #BheemsCeciroleo #MegaSankranthiBlockbusterMSG in cinemas now 🫶🏻 pic.twitter.com/70Gvhi4qSX
— Shine Screens (@Shine_Screens) January 20, 2026
అనిల్ రావిపూడి ట్వీట్..
#Naira is the niece of our Megastar @KChiruTweets garu ( Daughter of his Sister Madhavi garu )🤗
She has wonderfully sung the #FlyingHigh song from #ManaShankaraVaraPrasadGaru 👏🏻👏🏻👏🏻
With a long journey ahead of her, this is just a beautiful beginning… https://t.co/PZEPN1t3ox
— Anil Ravipudi (@AnilRavipudi) January 20, 2026
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




