AP SSC Time Table 2026: పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు..

అమరావతి, జనవరి 20: ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టైం టేబుల్ ప్రకారం పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2026 మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఏప్రిల్ 1 వరకు ఇవి జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఫిజికల్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం 9.30 నుంచి 11.30 వరకు జరుగుతాయి. ప్రభుత్వ సెలవుల ప్రకారం అవసరమైతే టైమ్‌టేబుల్‌లో మార్పులు ఉంటాయని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు స్పష్టం చేసింది. ప్రశ్నపత్రం తారుమారైతే రాసిన అభ్యర్థుల ఫలితాలు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ పదవతరగతి పబ్లిక్ పరీక్షల 2026 పూర్తి టైమ్‌టేబుల్ ఇదే..
- మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 18న సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 20న ఇంగ్లిష్ పరీక్ష
- మార్చి 23న గణితం
- మార్చి 25న ఫిజికల్ సైన్స్
- మార్చి 28న బయాలజికల్ సైన్స్ పరీక్ష
- మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్షతో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




