AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR-Neel: తారక్ సినిమాలో కీ రోల్‌ చేయనున్న బాలీవుడ్ లెజెండరీ నటుడు! ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటో?

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ఫీవర్​ నడుస్తోంది. టాలీవుడ్​, బాలీవుడ్​ అనే తేడా లేకుండా పాన్ ​ఇండియా సినిమాలను రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. టాలీవుడ్​ స్టార్ ​హీరోలందరూ వాటితో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పాన్ ​ఇండియా సినిమాల్లో ..

NTR-Neel: తారక్ సినిమాలో కీ రోల్‌ చేయనున్న బాలీవుడ్ లెజెండరీ నటుడు! ప్రశాంత్ నీల్ ప్లాన్ ఏంటో?
Ntr Prashanth
Nikhil
|

Updated on: Nov 29, 2025 | 10:13 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ఫీవర్​ నడుస్తోంది. టాలీవుడ్​, బాలీవుడ్​ అనే తేడా లేకుండా పాన్ ​ఇండియా సినిమాలను రూపొందిస్తున్నారు దర్శకనిర్మాతలు. టాలీవుడ్​ స్టార్ ​హీరోలందరూ వాటితో బిజీగా ఉన్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న పాన్ ​ఇండియా సినిమాల్లో ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్. ఈ సినిమా హైప్​ చూస్తుంటే అన్ని రికార్డులూ బద్దలు కొట్టేలా కనిపిస్తోంది.

KGF, సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ కెరీర్‌లోనే అతిపెద్ద బడ్జెట్ ప్రాజెక్ట్ ఇది. మైత్రీ మూవీ మేకర్స్, NTR ఆర్ట్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో నిర్మితమవుతోంది. ఇప్పటికే 300 కోట్లకుపైగా ఖర్చు అయినట్లు సమాచారం. ఈ చిత్రం గురించి గత కొన్ని నెలలుగా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. బాబీ డియోల్, ప్రభాస్ క్యామియో, హాలీవుడ్ టెక్నీషియన్లు ఇలా ఒక్కొక్క అప్‌డేట్ వస్తుంటే బ్లాక్​బస్టర్​ హిట్​ పక్కా అని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ట్రెండ్​ అవుతున్న ఓ అప్​డేట్​ మరోసారి అభిమానులను షాక్​కి గురిచేస్తోంది.

Anil Kapoor

Anil Kapoor

ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ అనిల్ కపూర్ కనిపించనున్నారని తెలుస్తోంది. 40 ఏళ్లుగా ఎనర్జీ లెవెల్స్‌ను ఎప్పుడూ డౌన్ కాకుండా రాణిస్తున్న లెజెండ్ అనిల్ కపూర్. రణ్​బీర్​ కపూర్​, సందీప్​ వంగా కాంబినేషన్లో వచ్చిన యానిమల్​లో అనిల్ కపూర్​ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే! మిస్టర్ ఇండియా నుంచి యానిమల్ వరకు, స్లమ్‌డాగ్ మిలియనీర్ నుంచి ఫైటర్ వరకు ప్రతి తరంతోనూ కనెక్ట్ అయిన అనిల్ కపూర్.. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఎన్టీఆర్​తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

ఈ కాంబినేషన్ పేరు బయటకు రాగానే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడనేది ఇంకా తెలియలేదు. కొందరు విలన్‌గా అంటూ, మరికొందరు ఎన్టీఆర్​కు మెంటార్ లేదా ఫాదర్ క్యారెక్టర్‌‌ కావొచ్చని అంచనా వేస్తున్నారు. అనిల్​ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తాడో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే!

Follow Us