Allu Arjun: అది జరగకపోతే ఇంత ప్రేమను పొందడానికి నాకు 20 ఏళ్లు పట్టేది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బన్నీ..
సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు అల్లు అర్జున్. 2003లో వచ్చి గంగోత్రి సినిమాతో మొదలైన బన్నీ సినీ కెరీర్ ప్రస్తుతం పీక్‌లోకి వెళ్లింది. టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నారు బన్నీ...

సినిమా ఇండస్ట్రీ నేపథ్యం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు అల్లు అర్జున్. 2003లో వచ్చి గంగోత్రి సినిమాతో మొదలైన బన్నీ సినీ కెరీర్ ప్రస్తుతం పీక్‌లోకి వెళ్లింది. టాలీవుడ్ అగ్ర హీరోల జాబితాలో చోటు దక్కించుకున్నారు బన్నీ. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన తాజాగా చిత్రం పుష్ప ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే క్రేజీ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయికి మళ్లీ అలాంటి ఊపును తీసుకొచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల భారీ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. సుకుమార్ మార్క్ డైరెక్షన్, అల్లు అర్జున్ యాక్టింగ్ సినిమాను విజయ తీరాలకు చేర్చింది. ఊహించని విజయాన్ని నమోదు చేసుకొని వంద కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా బాలీవుడ్‌కు పాకింది. ఒక ప్రాంతీయ కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇలా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం విశేషం.
ఇక బన్నీ కెరీర్ పుష్పకి ముందు పుప్ష తర్వాత అనేంతలా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా బన్నీనే తెలిపారు. ఇటీవల ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పుష్ప సినిమా తన సినీ కెరీర్‌లో ఎలంటి మార్పును తీసుకొచ్చిందే తెలిపారు. ఈ విషయమై బన్నీ మాట్లాడుతూ..’పుష్ప సినిమా ఆ రేంజ్ విజయాన్ని అందుకుంటుందని అసలు అనుకోలేదు. ఈ విషయం నన్ను ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒకవేళ పుష్ప సినిమా అనేది లేకపోతే ఇంత ప్రేమ, అభిమానాన్ని పొందడానికి నాకు కనీసం 20 ఏళ్లు పట్టేది’ అని చెప్పుకొచ్చారు. ఇక పుష్ప సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని తెలిపిన బన్నీ.. ఆ అంచనాలకు అనుగుణంగానే ప్రయత్నిస్తామని తెలిపారు.
ఇక పుష్ప సీక్వెల్ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు జరపుకుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 1 నుంచి మొదలవుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక పుష్ప తొలి పార్ట్ భారీ విజయాన్ని నమోదు చేసుకున్న నేపథ్యంలో, పుష్ప సీక్వెల్‌పై దర్శకుడు సుకుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే భారీ క్యాస్టింగ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలి పార్ట్‌లో సమంత స్పెషల్ సాంగ్‌లో నటించగా, సీక్వెల్‌లో బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. మరి పుష్ప సీక్వెల్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలిలాయంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.




మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..