Pushpa 2: విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2.. కానీ ఓ ట్వీట్స్
ఉత్తర అమెరికాలో విడుదలకు ముందే పుష్ప రూ.125 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అయితే అందులో ఓ ట్విస్ట్ ఉంది. ఓ హాలీవుడ్ నివేదిక ప్రకారం.. 'పుష్ప 2' ఉత్తర అమెరికాలో భారీ లాభాలను ఆర్జించిందని ట్రేడ్ వెబ్‌సైట్ రాసింది. దీనికి అమెరికాలో 125 కోట్లవరకు రాబట్టిందని అంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ‘పుష్ప 2’ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద చిత్రం. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం విదేశాలలో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఉత్తర అమెరికాలో విడుదలకు ముందే పుష్ప రూ.125 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అయితే అందులో ఓ ట్విస్ట్ ఉంది. ఓ హాలీవుడ్ నివేదిక ప్రకారం.. ‘పుష్ప 2’ ఉత్తర అమెరికాలో భారీ లాభాలను ఆర్జించిందని ట్రేడ్ వెబ్‌సైట్ రాసింది. దీనికి అమెరికాలో 125 కోట్లవరకు రాబట్టిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాలో ఇదే బిగ్గెస్ట్ బ్రేక్ ఈవెన్. అంటే థియేట్రికల్ రైట్స్ తోనే ‘పుష్ప 2’ రూ.125 కోట్లు రాబట్టిందన్నమాట.
మేకర్స్ ఉత్తర అమెరికాలో పంపిణీ చేస్తున్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ డీల్ విలువ రూ.125 కోట్లు అని టాక్. అయితే ఈ డీల్‌లో ట్విస్ట్ ఇదేనని రిపోర్ట్‌లో మరో విషయం కూడా చెప్పబడింది. దీని ప్రకారం, ఇది రీఫండబుల్ డీల్. అంటే, ఈ చిత్రం ఫ్లాప్ అయితే, మేకర్స్ ఈ డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అయితే, మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నిర్ణీత మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. అయితే ఆ మొత్తం ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు.
అయితే ఈ డీల్ ను బట్టి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తమ సినిమాపై నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా టీజర్ తోనే సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకి ముందు విడుదలైన పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ నవంబర్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాతే సినిమా అసలు ప్రమోషన్ మొదలవుతుంది. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.