బన్నీ కొత్త సినిమా టైటిల్?

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. […]

బన్నీ కొత్త సినిమా టైటిల్?
TV9 Telugu Digital Desk

| Edited By:

Jul 28, 2019 | 1:05 AM

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత గ్యాప్‌ తీసుకున్న అల్లు అర్జున్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో రూపొందిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను ఏఏ19గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ ఇదేనంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మరోసారి ఫాదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాకు ‘నేను నాన్న’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే, నివేదా పేతురాజ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈ సినిమాలో టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, రావూ రమేష్‌, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu