బాలీవుడ్‌లో రీమేక్ కానున్న మరో తెలుగు సినిమా

బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలపై కన్ను వేశారు. తెలుగులో సినిమా హిట్ అయితే చాలు హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అదే కోవలో తెలుగు ‘అర్జున్ రెడ్డి’.. బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు మరిన్ని తెలుగు సినిమాల హక్కులను దక్కించుకున్నారు. వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ సినిమాలు ఉండగా.. ఇక లేటెస్ట్‌గా రిలీజైన ‘డియర్ కామ్రేడ్’ […]

బాలీవుడ్‌లో రీమేక్ కానున్న మరో తెలుగు సినిమా
Ravi Kiran

|

Jul 27, 2019 | 9:18 PM

బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలపై కన్ను వేశారు. తెలుగులో సినిమా హిట్ అయితే చాలు హిందీలో రీమేక్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. అదే కోవలో తెలుగు ‘అర్జున్ రెడ్డి’.. బాలీవుడ్‌లో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో బాలీవుడ్ నిర్మాతలు మరిన్ని తెలుగు సినిమాల హక్కులను దక్కించుకున్నారు.

వాటిలో ‘జెర్సీ, ఆర్ఎక్స్100’ సినిమాలు ఉండగా.. ఇక లేటెస్ట్‌గా రిలీజైన ‘డియర్ కామ్రేడ్’ హక్కులను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ భారీ మొత్తానికి హక్కులు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా తాజా సమాచారం ప్రకారం మరొక తెలుగు చిత్రాన్ని కూడా హిందీలోకి రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్. అది కూడా రీసెంట్ హిట్ చిత్రమని తెలుస్తోంది. అయితే ఆ సినిమా ఏంటనేది తెలియాల్సి ఉంది. కొంతమంది ‘మజిలీ’ అంటుంటే.. మరికొందరు ‘గీతగోవిందం’ అంటున్నారు. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu