బిగ్ బాస్ 3: హిమజ, పునర్నవి సేఫ్..డేంజర్‌లో హేమ, సిప్లిగంజ్
బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా వారం పూర్తి చేసుకుంది. నిన్నటి విషయానికి వస్తే.. వరుణ్, వితికా జంట రొమాంటిక్ ముచ్చట్లు. టీవీ9 జాఫర్ భార్యను గుర్తుతెచ్చుకోని ఏడవడం వంటి అంశాలు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాయి. జాఫర్‌ను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి బాబా బాస్కర్ మాస్టర్ వేయించిన మూన్ వాక్ స్టెప్స్ హైలెట్‌గా నిలిచింది. ఇక తీన్మార్ సావిత్రి తన లవ్ స్టోరీ, తన భర్త గొప్పతనాన్ని చెప్తూ కాసేపు ఎమోషనల్ అయ్యింది. ఇక […]
బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా వారం పూర్తి చేసుకుంది. నిన్నటి విషయానికి వస్తే.. వరుణ్, వితికా జంట రొమాంటిక్ ముచ్చట్లు. టీవీ9 జాఫర్ భార్యను గుర్తుతెచ్చుకోని ఏడవడం వంటి అంశాలు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాయి. జాఫర్‌ను ఆ మూడ్ నుంచి బయటకు తీసుకురావడానికి బాబా బాస్కర్ మాస్టర్ వేయించిన మూన్ వాక్ స్టెప్స్ హైలెట్‌గా నిలిచింది. ఇక తీన్మార్ సావిత్రి తన లవ్ స్టోరీ, తన భర్త గొప్పతనాన్ని చెప్తూ కాసేపు ఎమోషనల్ అయ్యింది.
ఇక వీకెండ్ కావడంతో మాస్ సినిమాలోని సాంగ్‌తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. వచ్చీ రావడంతో హౌస్‌లో ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మన టీవీ ద్వారా కంటెస్టెంట్స్ మధ్య కన్వర్జేషన్‌ను చూపించారు. సరదా సంభాషణతో అందర్ని అలరించారు నాగ్. ఈ వారం రోజులు వాళ్లు ఇంట్లో ఎలా వ్యవహరించారో గుర్తు చేశారు.
జులై 21న హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 15 మంది ఇంటి సభ్యులు తొలి రోజు పాలు నీళ్ళలా కలిసిపోదామని ప్రమాణాలు చేసుకున్నప్పటికి తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ఎప్పుడు ఎవరు ఫైర్ అవుతారో, ఏ విషయం మీద గొడవపడతారో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. మొత్తానికి బిగ్ బాస్ హౌజ్‌లో ఆరు రోజుల జర్నీ సాగించిన ఇంటి సభ్యులలో ఒకరు సూట్‌కేసు సర్ధుకొని వెళ్ళే పరిస్థితి ఆసన్నమైంది.
ఎలిమినేషన్స్‌లో నుంచి సేఫ్ జోన్‌కి వెళ్లినవారు:
నామినేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్, హేమ ,జాఫర్, వితిక, హిమజ, పునర్నవి భూపాలం ఉండగా హిమజ, పునర్నవి సేఫ్ జోన్‌లోకి వెళ్ళారు. మిగతా నలుగురిలో ఒకరు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌ని వీడనున్నారు. ఎలిమినేషన్ టైం ఆసన్నమైందని చెప్పిన నాగ్ ఆరుగురిలో మొదటగా సేఫ్ జోన్‌కి వెళ్లిన కంటెస్టెంట్‌గా హిమజని ఎంపిక చేశారు. ఆ తర్వాత పునర్నవి సేఫ్ జోన్‌లో ఉన్నట్టు తెలిపారు నాగార్జున. మిగతా నలుగురు రాహుల్, వితికా, జాఫర్, హేమలలో ఒకరు ఈ రోజు బిగ్ బాస్ హౌజ్‌ని వీడనున్నారు. ఎలిమినేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్, హేమ పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి.లెట్స్ వెయిట్ అండ్ సీ.