AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి నాటి మెమొరీస్ గుర్తు చేసిన ఫోటో షూట్.. సేజ్ గ్రీన్ ఆర్గాంజా చీరలో అలియా రాయల్ లుక్!

బాలీవుడ్ స్టార్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ వివాహం 2022 ఏప్రిల్ 14న జరిగినప్పుడు 'గోల్డెన్ అవర్'లో తీసిన వారి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఆ మ్యాజిక్‌ను అలియా భట్ మరోసారి పునరావృతం చేస్తూ తన తాజా గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తున్నారు.

పెళ్లి నాటి మెమొరీస్ గుర్తు చేసిన ఫోటో షూట్.. సేజ్ గ్రీన్ ఆర్గాంజా చీరలో అలియా రాయల్ లుక్!
Alia In Green Saree
Nikhil
|

Updated on: Apr 02, 2026 | 11:00 AM

Share

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అలియా భట్​ సూర్యాస్తమయానికి ముందు వచ్చే ఆ అద్భుతమైన కాంతిలో ఫోటోలకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి, ఆమె అందం పట్ల అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ బంగారు కాంతిలో ఆమె దిగిన ఫోటోలు చూస్తుంటే, తన వివాహ సమయంలోని అందమైన క్షణాలు మళ్లీ కళ్లముందు కదలాడుతున్నట్లు అనిపిస్తుంది.

స్టైలింగ్ విశేషాలు

అలియా ఈ వేడుక కోసం ‘జాడన్ మణిపుర లోటస్’ సిరీస్ నుండి ఒక అద్భుతమైన ‘సేజ్ గ్రీన్’ ఆర్గాంజా చీరను ఎంచుకున్నారు. ఈ చీరపై ఉన్న పెద్ద పెద్ద పూల ఎంబ్రాయిడరీ వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయబద్ధంగా కట్టుకున్న ఈ చీరలో ఆమె ఎంతో హుందాతనంగా కనిపించారు. దీనికి జతగా వి-నెక్ బ్లౌజ్ ధరించి తన లుక్‌ను పూర్తి చేశారు.

ఎప్పటిలాగే అలియా మినిమలిస్ట్ మేకప్‌ను ఇష్టపడ్డారు. పింక్ టోన్స్, రోజీ లిప్స్, కళ్ల కింద చిన్న హైలైటర్ తో మెరిసిపోయారు. ఐలైనర్ వాడకుండా కేవలం మస్కారాతో కళ్లను అందంగా చూపించారు. జుట్టును మధ్యలో పాపిడి తీసి సింపుల్ గా వదిలేశారు. ‘మోక్ష’ బ్రాండ్‌కు చెందిన ఖరీదైన చోకర్, స్టడ్స్ ఆమె మెడలో మెరుస్తూ రాజసాన్ని తెచ్చిపెట్టాయి.

కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు, సినిమాల పరంగా కూడా అలియా భట్ చాలా బిజీగా ఉన్నారు. వైఆర్ఎఫ్ (YRF) బ్యానర్‌లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ ‘ఆల్ఫా’లో ఆమె పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి రొమాంటిక్ డ్రామా లవ్ & వార్ లో నటిస్తున్నారు.

అలియా భట్ ఎప్పుడూ తన సహజమైన అందంతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. చెన్నై ఈవెంట్ లో ఆమె ధరించిన ఈ గ్రీన్ ఆర్గాంజా చీర, పండుగలు లేదా వివాహ వేడుకల కోసం సిద్ధమయ్యే మహిళలకు ఒక గొప్ప ఫ్యాషన్ ఇన్‌స్పిరేషన్. మారుతున్న ట్రెండ్స్ కు తగ్గట్టుగా సంప్రదాయాన్ని మేళవించడంలో ఆమెకు సాటిలెవరూ లేరు.

Follow Us