AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూటు మార్చిన ముద్దుగుమ్మ.. గ్లామర్ గేట్లు ఎత్తేసిన కుర్ర భామ

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే ఇండస్ట్రీలో కనిపించకుండా మాయం అయ్యారు. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు రాక చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. కొంతమంది ఇప్పటికీ పెద్ద ఆఫర్స్ కోసం ఎదుచూస్తున్నారు .

రూటు మార్చిన ముద్దుగుమ్మ.. గ్లామర్ గేట్లు ఎత్తేసిన కుర్ర భామ
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 02, 2026 | 10:38 AM

Share

సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు నాకోసం ఎంతో మంది ఎదురుచూస్తూ ఉంటారు. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశం రాక ఎంతో మంది హీరోయిన్స్ ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. ఈ అమ్మడికి అందం, అభినయం ఉన్న అనుకున్న స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. వెయ్యికోట్ల సినిమాలో ఓ చిన్న పాత్ర చేసి అందరిని ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె మరెవరో కాదు.. అందాల మాళవికా నాయర్‌. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవడే సుబ్రమణ్యం, కల్యాణ వైభోగమే, మహానటి, ట్యాక్సీవాలా, థ్యాంక్యూ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక నాయర్‌.

సంతోష్‌ శోభన్‌ సరసన నటించిన అన్నీ మంచి శకునములే సినిమాకు కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  అలాగే  కల్యాణ్‌ రామ్‌ డెవిల్‌ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అదేవిధంగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఇక ఇప్పుడు బైకర్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. అంతే కాదు ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రూట్ మార్చి గ్లామరస్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది. బైకర్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పై మాళవిక చాలా ఆశలు పెట్టింది.

శర్వానంద్ హీరోగా, అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన హై-ఆక్టేన్ రేసింగ్ డ్రామా ‘బైకర్’. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ అడ్వంచరస్ చిత్రంగా రూపొందుతున్న బైకర్ డాల్బీ సినిమా, EPIQ, 4DX, PCX వంటి ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే గ్లింప్స్‌లు, పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై హ్యుజ్ బజ్‌ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us