AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM Charges: ఈ ప్రభుత్వ బ్యాంకులో అకౌంట్ ఉందా..? ఏటీఎం ఛార్జీలు భారీగా పెరిగాయ్.. జాగ్రత్త పడండి..

తమ కస్టమర్లకు కెనరా బ్యాంక్ షాకిచ్చింది. ఏటీఎం ఉచిత లావాదేవీ పరిమితిలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఫ్రీ ట్రాన్సాక్షన్ల పరిమితిలో కొత విధించింది. గతంలో ఆరు లావాదేవీలు ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉండగా.. ఇప్పుడు మార్పులు చేసింది. అలాగే బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రాకు ప్రయత్నిస్తే ఛార్జీలు విధించనుంది.

Venkatrao Lella
|

Updated on: Sep 02, 2026 | 3:17 PM

Share
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన కెనరా బ్యాంక్ తమ కస్టమర్లకు షాకిచ్చింది. ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా నెలవారీ ఉచిత ఏటీఎం ట్రాన్సాక్షన్ల పరిమితిని తగ్గించింది. ఇదే కాకుండా సేవింగ్స్ అకౌంట్లో సరిపడ బ్యాలెన్స్ లేకుండా విత్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తే భారీగా పెనాల్టీలు విధించనున్నట్లు వెల్లడించింది.

1 / 5
సెప్టెంబర్ 1వ తేదీ నుంచే ఈ  కొత్త ఛార్జీలను అమల్లోకి తెచ్చినట్లు స్పష్టం చేసింది. ఖాతాదారులు దీనిని గమనించాలని, ఇందుకనుగుణంగా లావాదేవీలు నిర్వహించుకోవాలని సూచించింది. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేట్ బ్యాంకులు ఏటీఎం ఉచిత లావాదేవీల పరిమితిని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలో కెనరా బ్యాంక్ కూడా అదే నిర్ణయం తీసుకుంది.

2 / 5
ఇప్పటివరకు కెనరా బ్యాంక్ ఏటీఎంలో ఉచిత ట్రాన్సాక్షన్ల పరిమితి ఆరుగా ఉండేది. ఇప్పుడు దానిని 5కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు కేవలం ఐదు లావాదేవీలు మాత్రం ఏటీఎంలలో ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైబడి చేస్తే ఛార్జీలు కట్ అవుతాయి. బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్ వంటి వాటిని కూడా ఉచిత పరిమితిలో చేర్చారు. ఉచిత లావాదేవీల తర్వాత అకౌంట్లో డబ్బులు లేకపోయినా విత్ డ్రాకు ప్రయత్నిస్తే రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది

3 / 5
ఏటీఎంలో ఉచిత లావాదేవీల తర్వాత ప్రతీ ట్రాన్సాక్షన్‌కు రూ.23 ప్లస్ జీఎస్టీ పడుతుంది. ఇప్పటివరకు ఇది రూ.20గా ఉండగా.. ఇప్పుడు మరో రూ.3 పెంచారు. అయితే సీనియర్ సిటిజన్లు నెలకు 8 ఉచిత ఏటీఎం లావాదేవీలు చేసుకోవచ్చు. ఈ లిమిట్ దాటాక వారికి ఒక్కొ ట్రాన్సాక్షన్‌కు రూ.5 ప్లస్ జీఎస్టీ పడుతుంది. సీనియర్ సిటిజన్ల లావాదేవీల పరిమితి ఎప్పటిలాగే ఉంచింది.

4 / 5
ఇప్పటినుంచి మెట్రో సిటీల్లోని కెనరా బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇతర బ్యాంక్ ఏటీఎంలో 3 ట్రాన్సాక్షన్లు ఫ్రీగా చేసుకోవచ్చు. అయతే కెనరా బ్యాంక్ ప్లాటినం, బిజినెస్, సెలక్ట్ వంటి కార్డ్స్‌కు గ్రీన్ పిన్ జనరేట్ చేసుకునేందుకు ఇప్పటివరకు రూ.23 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.5కి తగ్గించారు.

5 / 5
Follow Us