తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న హార్ట్ బ్రేక్ సిరీస్ బ్యూటీ.. ఫోటోస్ ఇదిగో
Rajitha Chanti
Pic credit - Instagram
01 September 2026
తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయకి దీపా బాలు, త్వరలోనే 'మారెమ్మ' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు.
మాధవ్ భూపతిరాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దీపా బాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ వేడుకకు సాంప్రదాయబద్ధమైన శారీ లుక్‌లో హాజరైన దీపా బాలు తన చిరునవ్వు, ఎలిగెంట్ స్టైల్‌తో అభిమానులను, మీడియాను ఆకట్టుకున్నారు హీరోయిన్ దీపా బాలు.
సింపుల్ జ్యువెలరీ, నేచురల్ మేకప్‌తో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కుతుంది.
ఈవెంట్‌లో మాట్లాడిన దీపా బాలు, తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెడుతుండటం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. 'మారెమ్మ' చిత్ర కథాంశం చాలా బలంగా ఉంటుందని
దర్శకుడు నాగరాజ్ ప్రతీ పాత్రను ఎంతో చక్కగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన సంగీతం, చిత్రానికి ప్రధాన బలమని తెలిపారు.
తన మొదటి తెలుగు ప్రాజెక్ట్‌తోనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రను ఎంచుకున్న దీపా బాలు, టాలీవుడ్‌లో మంచి భవిష్యత్తును సొంతం చేసుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.