AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : ఆ అందమేంటండీ బాబూ.. నెట్టింట చంపేస్తున్నారుగా.. నెట్టింట ఆ సీరియల్ బ్యూటీని చూసి షాకవుతున్న కుర్రాళ్లు.. ..

బుల్లితెరపై పవర్ ఫుల్ విలనిజంతో అదరగొట్టేస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ పాత్రల కంటే ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతోనే విపరతీమైన గుర్తింపు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ నటి సైతం తనదైన నటనతో, విలనిజంతో దూసుకుపోతుంది. ఇక బయట మాత్రం గ్లామరస్ ఫోజులతో హీరోయిన్లకు ధీటుగా కనిపిస్తుంది.

Serial Actress : ఆ అందమేంటండీ బాబూ.. నెట్టింట చంపేస్తున్నారుగా.. నెట్టింట ఆ సీరియల్ బ్యూటీని చూసి షాకవుతున్న కుర్రాళ్లు.. ..
Malini
Rajitha Chanti
|

Updated on: Sep 03, 2026 | 6:10 PM

Share

తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ పొందుతున్న సీరియళ్లలో ‘కార్తీక దీపం 2’ ఒకటి. ఈ సీరియల్‌లో ప్రతి పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇటీవల ఈ ధారావాహికలోకి ప్రవేశించి ‘మాలిని’ అనే పవర్ ఫుల్ విలన్ పాత్రతో అందరి దృష్టిని ఆకట్టుకున్న నటి తేజస్విని ప్రకాష్ నదింపల్లి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో తనదైన నటన, అభినయంతో ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకుంటున్నారు. తేజస్విని ప్రకాష్ ప్రధానంగా కన్నడ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి మరియు మాజీ మోడల్. బెంగళూరులో జన్మించిన ఈమె ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారు. 2007లో ‘మాతాద్ మాతాడు మల్లిగే’ అనే కన్నడ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత అనేక కన్నడ సినిమాలు, టెలివిజన్ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ ‘బిగ్ బాస్ 5’ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొని తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని సంపాదించుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

కన్నడలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తేజస్విని, తెలుగు బుల్లితెరకు లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ద్వారా పరిచయమయ్యారు. కానీ కార్తీక దీపం 2 ద్వారా విపరతీమైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ సీరియల్‌లో దక్షిణా మూర్తి కోడలుగా, ‘మాలిని’ అనే క్రూరమైన , పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో కనిపించి సీరియల్ కథను సరికొత్త మలుపు తిప్పారు. తన గ్లామరస్ లుక్స్ , స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

సోషల్ మీడియాలో కూడా తేజస్విని ప్రకాష్‌కు భారీగా ఫాలోయింగ్ ఉంది. ఆమె పంచుకునే తాజా ఫోటోషూట్లు, వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అప్‌డేట్లు నెట్టింట ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ‘కార్తీక దీపం 2’ సీరియల్‌లో ఆమె ఎంట్రీతో సీరియల్ రేటింగ్ మరింత పుంజుకుందని టీవీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న తేజస్విని ప్రకాష్, రాబోయే రోజుల్లో తెలుగులో మరిన్ని మంచి అవకాశాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

తేజస్విని ఫోటోస్..

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

Follow Us