AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Centuries: విరాట్ కోహ్లీ రికార్డు సమం..ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్

T20 Centuries: సీపీఎల్ 2026లో క్వింటన్ డికాక్ 10వ టీ20 సెంచరీ సాధించి విరాట్ కోహ్లీ రికార్డు సమం చేశాడు. సిపిఎల్‌లో బార్బడోస్ ఫలితాలు ఆశాజనకంగా లేకపోయినా డికాక్ మాత్రం తన వ్యక్తిగత ఫామ్‌తో సరికొత్త ఎత్తులకు ఎదుగుతున్నాడు. రాబోయే మ్యాచ్‌ల్లో డికాక్ ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయం.

T20 Centuries: విరాట్ కోహ్లీ రికార్డు సమం..ప్రపంచంలోనే ఐదో బ్యాటర్‌గా సౌతాఫ్రికా స్టార్
Quinton De Kock
Rakesh
|

Updated on: Sep 02, 2026 | 3:55 PM

Share

T20 Centuries: సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ క్వింటన్ డికాక్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL 2026)లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో టీ20 క్రికెట్‌లో పది సెంచరీలు పూర్తి చేసుకుని భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ప్రపంచంలో పది అంతకంటే ఎక్కువ టీ20 సెంచరీలు చేసిన ఐదో బ్యాటర్‌గా డికాక్ నిలిచాడు. సెప్టెంబర్ 1న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డికాక్ కేవలం 57 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 106 రన్స్ చేశాడు. గ్రౌండ్ నలుమూలలా విరుచుకుపడుతూ బౌలర్లపై ఒత్తిడి పెంచిన ఈ ఇన్నింగ్స్ అతని టీ20 కెరీర్‌లో 10వ సెంచరీ నమోదైంది. డికాక్ మెరుపులతో బార్బడోస్ జట్టు 217 పరుగుల భారీ స్కోరు సాధించింది.

డికాక్ బాదిన భారీ సెంచరీతో జట్టు విక్టరీ సాధిస్తుందని భావించినప్పటికీ మ్యాచ్ ఫలితం భిన్నంగా వచ్చింది. జేసన్ హోల్డర్ కెప్టెన్సీలోని సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జాన్సన్ చార్లెస్ 78 పరుగులతో రాణించగా, ఆండ్రీ ఫ్లెచర్ కేవలం 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. లీగ్‌లో డికాక్ అత్యధిక పరుగులు చేస్తున్నప్పటికీ బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచి రెండు విజయాలకే పరిమితమైంది.

టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్ ఇప్పుడు విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ సరసన నిలిచాడు. వీరిద్దరి ఖాతాలోనూ చెరో 10 టీ20 సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో క్రిస్ గేల్ 22 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా, పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజమ్ 13 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన టాప్ బ్యాటర్లు:

క్రిస్ గేల్ – 22 సెంచరీలు

బాబర్ ఆజమ్ – 13 సెంచరీలు

విరాట్ కోహ్లీ – 10 సెంచరీలు

డేవిడ్ వార్నర్ – 10 సెంచరీలు

క్వింటన్ డికాక్ – 10 సెంచరీలు

500 సిక్సర్ల క్లబ్‌లో డికాక్

సౌతాఫ్రికా వికెట్ కీపర్ డికాక్ ఇప్పటివరకు 457 టీ20 మ్యాచ్‌లు ఆడి 12,867 పరుగులు సాధించాడు. అతని సుదీర్ఘ కెరీర్‌లో 10 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ20లలో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 140 పరుగులుగా ఉంది. టీ20 క్రికెట్ చరిత్రలో 500 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన 13 మంది బ్యాటర్ల ప్రత్యేక జాబితాలో కూడా డికాక్ చోటు సంపాదించుకోవడం విశేషం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
NEET UG MBBS కౌన్సెలింగ్‌ అభ్యర్థులకు కీలక సూచనలు..
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
రోహిత్ శర్మకు రీప్లేస్ మెంట్స్ వచ్చేశార్రోయ్..!
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
SIR సిత్రాలు.. భారతరత్న సైంటిస్టుకు నోటీసులు! అసలేం జరిగిందంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
దులీప్ ట్రోఫీ 2026 విజేత దక్కించుకునే ప్రైజ్ మనీ ఎంతంటే?
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
ఇకపై ఏసీ బస్సుల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం.. మహిళలకు పండుగే..
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
గుడ్‌న్యూస్.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు మరో 3 ఏళ్లు వయో సడలింపు!
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
పొద్దున్నే ఒక గుడ్డు తింటే 100 ఏనుగుల బలం.. పెంకు ఈజీగా రావాలంటే
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
డెలివరీ బాయ్స్‌కు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త..
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?
త్రిగుణ్ ఆ బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్‌కు దగ్గరి బంధువా?