AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్.. నా ఓటు హీరో విజయ్‌కే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్..

ప్రస్తుతం తమిళనాడులో ఎలక్షన్ హీట్ నడుస్తోంది. ఈనెల 23న అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే వంటి అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలతో పాటు హీరో దళపతి విజయ్ కూడా ఈసారి టీవీకే పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు.

TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్.. నా ఓటు హీరో విజయ్‌కే అంటోన్న టాలీవుడ్ హీరోయిన్..
TVK Vijay
Basha Shek
|

Updated on: Apr 02, 2026 | 9:45 AM

Share

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు హీరో దళపతి విజయ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచాడు. టీవీకే పార్టీ తరఫున ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు విజయ్. మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ వాణి భోజన్‌ తన మద్దతు టీవీకే అధినేత విజయ్‌కే అని ప్రకటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలపై స్పందించింది. ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు వాణి భోజన్ ఇలా ఆన్సర్ ఇచ్చింది. ‘నేను హీరో విజయ్ దళపతికి వీరాభిమాని. ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలన్న కోరిక ఉండేది. కానీ ఇప్పుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టడంతో విజయ్ తో నటించే అవకాశం నెరవేరలేదు. అయితే ఆయన రాజకీయ రంగప్రవేశం చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. విజయ్‌ తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించడం సంతోషకరం’ అని వాణీ భోజన్ చెప్పుకొచ్చింది.

ఇక టీవీకే విజయ్ పార్టీలో చేరే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు వాణీ భోజన్ స్పందిస్తూ.. ‘ నాకు విజయ్ అంటే అభిమానం. అవకాశం వస్తే ఆయన పార్టీలో కచ్చితంగా చేరుతాను. ఎవరేమనుకున్నా ఈ ఎన్నికల్లో నా మద్దతు మాత్రం విజయ్‌కే’ అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. కాగా తమిళనాడులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న వాణీ భోజన్ తెలుగు ఆడియెన్స కు కూడా పరిచయమే. ఓమై కడవుల్‌ చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె మహాన్, మిరన్‌ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయమైంది. అలాగే కొన్ని వెబ్ సిరీసుల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా అనే తెలుగు సినిమాలోనూ హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వలై అనే చిత్రంలో అధర్వకు జంటగా నటిస్తోంది. అలాగే గ్యాంగర్స్ అనే మరో మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

వాణీ భోజన్ లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by Vani Bhojan (@vanibhojan_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us