5

ఈ వార్త వింటే అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. ఆయనతో పాటు వారిద్దరూ కూడా నటిస్తున్నారట..

అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా బాక్సాఫీసు దగ్గర ఎంతటి ఘన విజయం సాధించిందో..

ఈ వార్త వింటే అక్కినేని ఫ్యాన్స్‌కు పండగే.. ఆయనతో పాటు వారిద్దరూ కూడా నటిస్తున్నారట..
Follow us

|

Updated on: Nov 30, 2020 | 4:44 PM

Akkineni fans:అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ హీరో, హీరోయిన్లుగా నటించిన సోగ్గాడే చిన్ని నాయనా బాక్సాఫీసు దగ్గర ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ముఖ్యంగా అందులోని బంగర్రాజు పాత్ర నాగ్ ఫ్యాన్స్ అందరికి విపరీతంగా నచ్చేసింది. దీంతో దానికి డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ బంగర్రాజు టైటిల్‌తో సీక్వెల్ ప్లాన్ చేశారు. దీనికోసం ఆయన చాలా రోజుల నుంచి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. కాగా ఇటీవల కథ ఫైనల్ అయిందని సమాచారం. బిగ్‌బాస్ కంప్లీట్ అయిన తర్వాత నాగార్జున ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే మరొక వార్త కూడా టాలీవుడ్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో ఆయన తనయుడు నాగచైతన్య నటిస్తున్నారని చెబుతున్నారు. కాగా ఇప్పడు అఖిల్‌తో సహా ముగ్గురు ఈ సినిమాలో చేస్తున్నారని అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలంటే చిత్రయూనిట్ క్లారిటీ ఇవ్వాల్సిందే. దీని గురించి ఇప్పటి వరకు నాగార్జున, డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ ఎక్కడా మాట్లాడలేదు. అయితే వయసుకు తగ్గ పాత్రలో నాగార్జున కనిపిస్తాడని.. కాస్త రొమాంటిక్ యాంగిల్ ఉన్న వ్యక్తిగా బంగార్రాజు కనిపించబోతున్నాడు అంటున్నారు. అయితే సినిమాలో చైతు, అఖిల్ క్యారెక్టర్లు ఏంటనేది మాత్రం ఇప్పటికీ తెలియడం లేదు. మొత్తానికి బంగర్రాజు సినిమా గురించి ఇండస్ట్రీలో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఏది జరిగినా నాగార్జున ఫ్యాన్స్‌కు మాత్రం పండగే.