Bigg Boss 4 : మొదలైన నామినేషన్ రచ్చ … అరియనా పై ఫైర్ అయిన మోనాల్ .. మధ్యలో దూరిన అవినాష్ ను కూడా…
బిగ్ బాస్ షోలో సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఆదివారం వచ్చిందంటే ఏడుస్తూ.. ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకబోసే ఇంటిసభ్యులు నామినేషన్ అనగానే విమర్శిస్తూ విరుచుకు. ఇక నేడు సోమవారం కావడంతో నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్.
బిగ్ బాస్ షోలో సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఆదివారం వచ్చిందంటే ఏడుస్తూ.. ఒకరి మీద ఒకరు ప్రేమ ఒలకబోసే ఇంటిసభ్యులు నామినేషన్ నిందలు,విమర్శలతో రచ్చచేస్తారు . ఇక నేడు సోమవారం కావడంతో నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు బిగ్ బాస్. నామినేషన ప్రక్రియలో భాగంగా అందరికీ కొన్ని రంగులను ఇచ్చి.. ఎవర్ని అయితే నామినేట్ చేయాలనుకున్నారో ఆ రంగును తీసుకెళ్లి వాళ్ల సీసాలో పోయమని చెప్పాడు బిగ్ బాస్. అందరికి షాక్ ఇస్తూ హారికా ఈ సారి అభిజీత్ ను నామినేట్ చేసింది. మరో వైపు మోనాల్ కూడా అఖిల్ ను నామినేట్ చేసింది.
ఇన్నిరోజులు బెస్ట్ ఫ్రెండ్స్ లా బిగ్ బాస్ లో చట్టపట్టాలేసుకు తిరిగిన ఈ బ్యాచ్ ఇలా ఒకరినొకరు నామినేట్ చేసుకోవడంతో అందరు షాక్ అయ్యారు. అంతకు ముందు అఖిల్ కు అవినాష్ కు కూడా వాగ్వాదం జరిగింది. ఇంట్లో నాకన్నా వీక్ కంటెస్టెంట్ ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఎలిమినేటి కావాలని అని అన్నాడు అవినాష్ . దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా అంటూ అఖిల్ సీరియస్ అయ్యాడు. బ్రెయిన్ తో గేమ్ ఆడు అంటూ అఖిల్ సలహా ఇస్తే లేదు హార్ట్ తో ఆడతా అంటూ సమాధానం ఇచ్చింది మోనాల్. దాంతో అందరిముందు నన్ను బ్యాడ్ చేసావ్ అంటూ మోనాల్ పై ఫైర్ అయ్యాడు అఖిల్. ఇక అరియనా వచ్చి మోనాల్ ను నామినేట్ చేసింది. ఈ ఇద్దరిమధ్య కాసేపు రచ్చ జరిగింది. ఈ వాగ్వాదంలో మోనాల్ ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే అవినాష్ ఎంటర్ అయ్యి తెలుగులో మాట్లాడమని మోనాల్ కు సలహా ఇచ్చాడు. దాంతో అసలే కాక మీదున్న మోనాల్ అవినాష్ ను మధ్యలో మాట్లాడవద్దు అంటూ గట్టిగా అరిచేసింది.