AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులకు ప్రసాదం పంచిపెట్టిన ఉద్యమ రైతులు.. సోషల్ మీడియాలో జై కొడుతున్న నెటిజన్లు..

లాఠీలతో కొట్టినా... బూటు కాలితో తన్నినా... వాటర్ కేనన్లతో తమపై విరుచుకుపడినా.. టియర్ గ్యాస్‌తో ఉక్కిరి బిక్కిరి చేసినా..

ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులకు ప్రసాదం పంచిపెట్టిన ఉద్యమ రైతులు.. సోషల్ మీడియాలో జై కొడుతున్న నెటిజన్లు..
Shiva Prajapati
| Edited By: |

Updated on: Nov 30, 2020 | 4:25 PM

Share

లాఠీలతో కొట్టినా.. బూటు కాలితో తన్నినా.. వాటర్ కేనన్లతో తమపై విరుచుకుపడినా.. టియర్ గ్యాస్‌తో ఉక్కిరి బిక్కిరి చేసినా.. అవేవీ పట్టించుకోలేదు ఆ రైతులు. దేశానికి అన్నం పెట్టడం కోసం ఆరుగాలం చేసే కష్టం ముందు ఈ బాధలు ఎంత అనుకున్నారో.. గురునానక్ బోధనల ప్రభావంతో మనుషులందరూ ఒక్కటేనని భావించారో గానీ.. తమను అడ్డుకునేందుకై విచక్షణా రహితంగా దాడులకు పాల్పడిన పోలీసులకు ఒక్కరిని కూడా వదలకుండా ప్రసాదం పంపిణీ చేసి తాము మనుషులమని, ముఖ్యంగా అన్నదాతలమని మరోసారి రుజువు చేసుకున్నారు.

కేంద్ర తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసులతో గత ఐదు రోజులుగా పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ రైతుల్లో దాదాపు అందరూ సిక్కులే ఉన్నారు. నేడు గురునానక్ దేవ్ ప్రకాశ్ పర్వ్(551వ జయంతి) సందర్భంగా రైతులు తాము నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతంలోనే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా తయారు చేసిన ప్రసాదాన్ని అక్కడ ఉన్న పోలీసు బలగాలందరికీ పంచి పెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఎంతైనా రైతు రైతే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘జై జవాన్.. జై కిసాన్’ మన దేశంలో వినిపించే ప్రధాన నినాదం.. కానీ ఇప్పుడు ఆ జవాన్, కిసాన్ మధ్యే యుద్ధం నడుస్తోంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!