రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంగం కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రరావు...

రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీజేపీ నేతలు.. అరెస్ట్ చేసిన పోలీసులు..
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 30, 2020 | 2:02 PM

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంగం కార్యాలయం ముందు రాష్ట్ర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రరావు, ఇంద్రసేనా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌కు, ఎన్నిక సంఘం, పోలీసులకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. గ్రేటర్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్దంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అధికారులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నా ఎన్నికల సంఘం అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ నేతల ధర్నాపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని రఘునందన్ రావు, రామచంద్రారావు, ఇంద్రసేనా రెడ్డి సహా ధర్నాలో పాల్గొన్న ఆ పార్టీ నేతలందరినీ అరెస్ట్ చేసి తరలించారు. ఇక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీస్ యంత్రాంగం పని చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు నేడు ఈసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

ఇదిలాఉండగా, ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ ఏదోలా రాద్దాంతం చేసి వార్తల్లో ఉండాలనే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు ఇలా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.

పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
పెద్ద పండుగ వేళ ఏపీలో వానలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్..
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
ఖర్చు చేసింది రూ. 7 వేలు.. ఇంటికి పట్టుకెళ్లింది రూ. 90 లక్షలు
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
తమన్ మ్యూజిక్ దెబ్బకు కిందపడిన స్పికర్లు..
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
ఉదయాన్నే నానబెట్టిన అంజీర్ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ సమస్యలన్నీ
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
కారులో కనిపించింది చూసి కంగుతిన్న పోలీసులు
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ది రాజా సాబ్‌ లేటెస్ట్ అప్డేట్
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే