Ajay Devgn: కాజోల్, అజయ్ దేవగన్, మధ్యలో పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ దుమారం..!
బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కాజోల్ 26 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారని, బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని అందరూ అనేవారు. తాజాగా ఒక షోలో పెళ్లిపై కాజోల్ చేసిన కామెంట్లు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్ ఉండాలంటూ కాజోల్ చేసిన వ్యాఖ్యలు, ప్రేమకు అర్ధం మారిపోయిందంటూ అజయ్ దేవగన్..

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, కాజోల్ 26 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారని, బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అని అందరూ అనేవారు. తాజాగా ఒక షోలో పెళ్లిపై కాజోల్ చేసిన కామెంట్లు అభిమానులను షాక్‌కు గురిచేశాయి. అద్భుతమైన కెమిస్ట్రీ వీరి మధ్య ఉందని నమ్మిన వారంతా ఒక్కసారిగా అయోమయానికి గురవుతున్నారు.
అసలు ఏం జరిగింది?
‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ షో ఫినాలే ఎపిసోడ్‌లో పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్ ఆప్షన్ ఉండాలని కాజోల్ సూచించారు. ‘పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్ ఆప్షన్ ఉండాలా?’ అని హోస్ట్ ట్వింకిల్ ఖన్నా ప్రశ్నించింది. దానికి బదులు విక్కీ, కృతి, ట్వింకిల్ ‘లేదు’ అని ఒకవైపు నిలబడగా, కాజోల్ మాత్రం ‘అవును’ అంటూ గ్రీన్ బాక్స్‌లోకి అడుగుపెట్టింది.
కాజోల్ తన ఆలోచనే సరైనదనే వాదించింది. ‘సరైన వ్యక్తిని సరైన సమయంలో పెళ్లి చేసుకుంటామని గ్యారంటీ ఏంటి? రెన్యూవల్ ఆప్షన్ కూడా ఉంటే బాగుంటుంది. ఎక్స్‌పైరీ డేట్ ఉంటే ఎక్కువ కాలం ఎవరూ బాధపడాల్సిన అవసరం ఉండదు’ అని చెప్పింది కాజోల్. అలాగే ‘డబ్బు సంతోషాన్ని కొనగలదా?’ అనే ప్రశ్నకు ట్వింకిల్, విక్కీ ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. కాజోల్ ‘కాదు’ అని, ‘ఎంత డబ్బు ఉన్నా అది సంతోషానికి అడ్డంకి అవుతుంది. నిజమైన సంతోషాన్ని అనుభవించకుండా చేస్తుంది’ అని వివరించింది.
ఇక ‘బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి ఎక్స్‌లతో మరొకరు డేట్ చేయకూడదా?’ అని అడిగిన ప్రశ్నకు.. ట్వింకిల్ ‘బాయ్‌ఫ్రెండ్ కంటే ఫ్రెండ్స్ నాకు ముఖ్యం. అలా చేయడం వల్ల ఎక్కడైనా దొరికిపోవచ్చు’ అని చెప్పింది.
అజయ్ దేవగన్ ఏం చెప్పారంటే..
వివాహానికి ఎక్స్‌పైరీ డేట్, రెన్యూవల్ ఉండాలని కాజోల్ చెప్పిన తర్వాత అజయ్ దేవగన్ ప్రేమపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘నేడు లవ్ అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ పదం దాని నిజమైన ఫ్లేవర్‌ను కోల్పోయింది. హీరో ఆర్.మాధవన్‌తో కలిసి బుక్‌మైషో యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అజయ్ ఈ కామెంట్స్ చేశాడు.
“నాకు తెలిసినంత వరకు, ప్రేమ అనే పదం చాలా సాధారణం అయిపోయింది. దానిని అనవసరంగా ఉపయోగిస్తున్నారు. దాని అర్థం కూడా మార్చేశారు. ఈ తరం వాళ్లు ప్రేమ అనే పదంలో ఉన్న పవిత్రతను అర్ధం చేసుకోలేరు. అందుకే దానిని ఎక్కువగా ఉపయోగించేస్తున్నారు’ అని దేవగన్ అన్నారు.
అజయ్ దేవగన్ మాటలతో ఏకీభవించిన మాధవన్.. ఒకప్పుడు ప్రేమ అనే పదాన్ని చాలా సీరియస్‌గా తీసుకునేవారు. ప్రస్తుతం ప్రతి చిన్న భావాన్ని వ్యక్తపరిచేందుకు కూడా ఉపయోగించేస్తున్నారు. ప్రతి మెసేజ్‌లోనూ హార్ట్ ఎమోజీ పెట్టేస్తున్నారు.’ అని పేర్కొన్నారు. ఏది ఏమైనా ఈ విషయంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.




