AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chaitanya Akkineni: ఆదరించినందుకు ధన్యవాదాలు..! నాగచైతన్య సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టి సమంత రెండో పెళ్లి మీదే ఉంది. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్‌ నుంచి కోలుకున్న అనంతరం సమంత దాదాపుగా తెలుగు తెరకు దూరమైంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం టాలీవుడ్‌పై దృష్టిపెట్టలేదు. నాగచైతన్య కూడా హీరోయిన్ ..

Chaitanya Akkineni: ఆదరించినందుకు ధన్యవాదాలు..! నాగచైతన్య సోషల్ మీడియా పోస్ట్‌ వైరల్
Naga Chaitanya
Nikhil
|

Updated on: Dec 02, 2025 | 9:40 AM

Share

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి దృష్టి సమంత రెండో పెళ్లి మీదే ఉంది. నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్‌ నుంచి కోలుకున్న అనంతరం సమంత దాదాపుగా తెలుగు తెరకు దూరమైంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం టాలీవుడ్‌పై దృష్టిపెట్టలేదు. నాగచైతన్య కూడా హీరోయిన్ శోభిత ధూళిపాళను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

తాజాగా రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది సమంత. పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. కాగా, సమంత రెండో పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్య చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాగచైతన్య, సమంత విడాకుల వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి చాలా మంది సమంతను ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

నాగచైతన్య మంచివాడని, సమంత కారణంగానే విడాకులు జరిగాయని కూడా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏది ఏమైనా వారిద్దరూ విడిపోయారని, ఇక ఈ చర్చ అనవసరమని చాలా మంది కామెంట్లు చేశారు. అయితే, సమంత రెండో పెళ్లి చేసుకున్న సమయంలో ఈ చర్చ మరోసారి మొదలైంది. చైతన్య మంచివాడని, ఫ్యామిలీ మ్యాన్‌ 2 నుంచే సామ్ రిలేషన్‌లో ఉన్నందున చై, సామ్ మధ్య వివాదం మొదలై విడాకుల వరకు వెళ్లిందనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి.

ఇక, ఈ ట్రోలింగ్స్ కొనసాగుతున్న సమయంలో నాగచైతన్య సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. తాను నటించిన వెబ్ సిరీస్ దూత విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఆ సిరీస్ ని హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు చై. ‘ఒక నటుడిగా విభిన్నంగా, నిజాయితీగా కథను ఎంపిక చేసుకుని, ఉత్తమమైన నటన కనబరిస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని నిరూపించిన సిరీస్ దూత. సినీ ప్రేమికులు ఆ ఎనర్జీని తీసుకుని మళ్లీ తిరిగి ఆ నటుడికి అంతే బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తారు. దూత రిలీజ్ అయ్యి రెండేళ్లు  అయ్యింది. దానిని సాధ్యం చేసిన టీమ్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అని చెప్పాడు నాగచైతన్య.

కాగా, ఈ పోస్ట్‌పై పలువురు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని చై.. సరిగ్గా సమయానికి పోస్ట్ చేయడం సూపర్ అని ఒకరు.. సామ్‌తో విడాకులు ఎందుకు అయ్యాయో అర్థమైందని మరొకరు కామెంట్లు పెడుతున్నారు.

Follow Us